Others

‘కల కానిది విలువైనది..’ (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి కీ.శే. శ్రీశ్రీగారు అందించిన అమృతగుళిక ‘కల కానిది విలువైనది..’ అనే పాట అర్ధశతాబ్ది కాలం దాటినా ఇంకా అజరామరమే! నిరాశపడి సాధించేది ఏమీ లేదని- సాహసోపేతమైన సాధనతోనే సమస్తం సమకూరుతాయని తెలియజేసిన ఈ సందేశాత్మక గీతం- సందేహం లేకుండా ఉత్తమ సాహిత్య విలువలు కలిగిందని చెప్పవచ్చు! సాహిత్యానికి సముచిత ఔన్నత్యాన్ని చేకూరేవిధంగా - సంగీతం సమకూర్చిన కీ.శే. పెండ్యాల నాగేశ్వరరావుగారి సమయోచిత బాణీ మరింత కొనియాడదగినది. విలువైన బతుకును కన్నీటి ధారలలో బలిచేయకుండా కాపాడుకోమన్న పల్లవి ఈ పాటకు వెలకట్టలేని విలువను చేకూర్చింది. ఇంక చరణాలలోకి వెళ్తే- గాలికి వాలిపోయే పూల తీగను అలాగే వదిలేయకుండా చేరదీసి నీరు పోసి చిగురించేలా చేయమన్న కర్తవ్యబోధ, అలాగే ఆఖరి చరణంలో - అగాథవౌ జలనిధిలో ఆణిముత్యం ఉంటుందని- శోకాల మరుగున దాగి వున్నదే సుఖమని- ప్రయత్నం లేకుండా ఏదీ మన దరి చేరదని- శోధించి సాధించడమే ధీరుల ఉత్తమగుణమని ఉద్బోధనందించిన ఈ పాటలోని సాహిత్యం సమున్నతమైన సత్యాలను చెప్పి జీవితం విలువల్ని కాపాడే విధంగా కలకాలం నిలిచిపోయింది. అమరగాయకుని అద్భుత స్వరం ద్వారా ఈ పాటలోని గొప్పతనం మరింత ద్విగుణీకృతమైంది. కీ.శే. అక్కినేనివారి అభినయ కౌశలం అనుభవైకమై అలరించింది. ఇటువంటి మంచి పాటల్ని మననం చేసుకొంటూ ఉంటే నేటి సినిమాల్లో ఇటవంటి సందేశాత్మక సాహిత్యం ఎందుకు అందించలేకపోతున్నాం అనే బాధ - హృదయాన్ని కలచివేస్తూ ఉంటుంది. సంగీత సాహిత్యపరంగా పదికాలాలపాటు స్థిరంగా నిలిచిపోయే మంచి పాటలు మళ్లీ వినగలమా? అనే అనుమానం కూడా వస్తోంది! బహుశా అది నిజమేనేమో కూడా!

-మరువాడ భానుమూర్తి వనస్థలిపురం, హైదరాబాద్