Others

కాలేయంలో కొవ్వు ప్రమాదమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేయంలో ఎక్కువగా నిలువ ఉన్న కొవ్వు ద్వారా కాలేయానికిగానీ, శరీరానికిగానీ 80శాతం మందిలో ఎలాంటి ప్రమాదం ఉండదు. మిగిలిన 20శాతం మందిలో ఫ్యాట్ లివర్ వ్యాధికి కారణమవుతోంది. ఈ వ్యాధి రెండో దశకు చేరుకోవచ్చు. అది నాన్ అల్కహాలిక్ స్టాటో హైపటెటిస్ (ఎన్‌ఎఎస్‌హెచ్) దశలో దీనిని గుర్తించినట్లయితే, ఇది మూడో దశకు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనిని ‘సిర్రోసిస్ ఆఫ్ లివర్’అంటారు దీనిలో కాలేయ కణాలు స్క్వార్ అనే కణజాలంలో మార్పిడి చేస్తారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. రక్తపు వాంతులు అవ్వడం, కడుపులో నీరు నిండటం, కాలేయ సంబంధిత కోమా వంటి సమస్యలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ అనేది వ్యాధి కాదు. ఇది వివిధ రకాల ఇతర వ్యాధుల వల్ల సంభవించవచ్చు. ప్రధానంగా ‘మెటబోలిక్ సిండ్రోమ్’ అనే అవాంఛిత చర్య వల్ల ఏర్పడుతుంది. దీని వల్ల గుండె, మెదడు సంబంధిత ప్రమాదాలకు దారితీస్తుంది. వాస్తవానికి కాలేయం కొవ్వుకి కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, దేహానికి ఉపయోగపడే విధంగా తయారుచేస్తుంది. కాలేయం కూడా కొన్ని రకాలైన కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తూ కరిగిస్తూ ఉంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఈ చర్యలో ఏమాత్రం తేడా వచ్చినా కొవ్వు కరిగించకుండా, కాలేయ కణాలలో నిలువ చేస్తాయి. ఇదే ఫ్యాటీ లివర్‌కి దారితీస్తుంది.