Others

ఓటరు చైతన్యమే శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క ఓటు గెలుపు ఓటముల నిర్ధారణ జరిగే ఎన్నికల వ్యవస్థ మనది. ఓటర్లు చురుకైన భాగస్వామ్యమే ప్రజాస్వామ్యయుత ఎన్నికల వ్యవస్థ విజయానికి కీలకం. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడంలోతే సరిపెట్టకుండా ఓటర్ల నమోదును చురుకుగా నిర్వహిస్తూ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఏ రాజకీయ పక్షానికి తలవంచక స్వతంత్రంగా తన విధులు నిర్వహిస్తోంది. కేంద్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపు కార్డులను కూడా అందజేస్తారు. 1971లో పురుష ఓటర్ల సంఖ్య 60.87 శాతం ఉంటే 2014 నాటికి అది స్వల్పంగా పెరిగి 67 శాతానికి చేరింది. అదేకాలంలో మహిళా ఓటర్ల సంఖ్య 49.11 శాతం నుంచి ఎకాయెకి 65.54 శాతానికి పెరిగింది. ఎన్నికల కమిషన్ నిరంతర ప్రయత్నాల వల్ల యువజనులు చైతన్యమై ఓటర్లుగా పేరు నమోదు చేయించుకున్నారు. ఓటర్ల ఆలోచనల్లో వస్తున్న మార్పులతోపాటు ఎన్నికల సంఘం కల్పించిన చైతన్యం కూడ ఒక కారణంగా పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటుహక్కు విలువను చాటిచెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటరుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న నినాదాలను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. 1950 నుంచి మనదేశంలో అమలులోకి వచ్చిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు రాజకీయ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పుగా చెప్పొచ్చు. ఓటరు దినోత్సవం నాడు కొత్తగా ఓటరు పేర్లు నమోదు చేస్తారు. ఓటుహక్కు వజ్రాయుధంలాంటిది. అందువల్లే ఎన్నికల్లో ఓటర్లు చురుకుగా పాల్గొనేలా ఎన్నికల సంఘం చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. నైతిక, ఉన్నత విలువలు ఉన్నవారిని ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నచ్చనివారికి ఓటు వేయకూడదనుకున్న ఓటరుకు తన ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబోవ్). ఈ మీట నొక్కడం ద్వారా ఓటరు తిరస్కార ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో తిరస్కార ఓటుహక్కను అమలు చేసిన దేశాలలో 14వ స్థానంలో భారత్ నిలిచింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఇది అమల్లోకి వచ్చింది. 2009లో ఈ ‘నోటా’ హక్కును తీసుకురావాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అయితే 2013 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు రూలింగ్ మేరకు ఆ తరువాత ఇది అమల్లోకి వచ్చింది. అందుకే ఓటుహక్కు విలువను తెలుసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో పాలుపంచుకోవాలి. ఓటరు నమోదు చేసుకోవడం, ఎన్నికలప్పుడు ఓటు హక్కు వినియోగించడం ప్రతీ పౌరుని విధి, బాధ్యత.

-కె.రామ్మోహన్‌రావు