Others

కర్మల ఫలమే జన్మలు (పురాణ వ్యక్తులు పూర్వజన్మలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్లగా తన చేతిని ధ్రువుని శిరస్సున స్వామి ఉంచాడు. వెంటనే ఇహలోకంలోకి వచ్చిన ధ్రువుడు కన్నులు విప్పార్చి స్వామిని దర్శించాడు.స్వామి చూచిన క్షణం ఆయన కనులనుంచి అశ్రువులు కారిపోతున్నాయి. శరీరమంతా వణికిపోతున్నది. ఏదోచెప్పాలనుకొన్నాడు. కాని నోట మాటరావడంలేదు. గొంతు తడారిపోతోంది. అమితమైన సంతోషంతో ఒళ్లు పులకిస్తోంది. ధ్రువుని అవస్థను చూసి కృపాళు అయిన భగవంతుడు తనచేయి ధ్రువుని చెక్కిళ్లకు తాకించాడు. వెంటనే ‘‘ముకుందా! మురారి, వేణుగోపాల! రమా మనోహరా! విశ్వతోముఖా! మాధవా! నారాయణా’అంటూ సర్వాంతర్యామి నేడు చేసుకొన్న పుణ్యమేమో నాకు తెలియదు కాని నేను ఈక్షణంలో నీ దయామృతాన్ని గ్రోలినందువల్లే నేను నిన్ను చూస్తున్నాను. మాట్లాడగలుగుతున్నాను’’ అంటూ దేవుని స్తుతించాడు. కీర్తించాడు. ఎంత సేపు శ్రీహరిని చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తోంది. అలా ఆగని ప్రవాహంలా స్తుతించే ధ్రువుని చూసి ‘ధ్రువకుమారా! నేను నీ అంతరంగాన్ని చూసాను. నీ నడవడిని పరిశీలించాను. నీవు కోరిన కోరికను విన్నాను. నీవు అరవై వేల సంవత్సరాల తరువాత ధ్రువక్షితి అన్న ఉన్నత స్థానానికి వెళ్లగలవు. మీ తండ్రి నిన్ను సర్వసామ్రాజ్యానికి సర్వాధికారిగా నియమిస్తాడు. ఆ తరువాత నీ తండ్రి వానప్రస్థానానికి వెళ్తాడు. నీ తమ్ముడు కూడా ఎంతో కాలం నీతో కలసి ఉండి చివరకు వేట నిమిత్తం వెళ్లి యక్షుల చేతిలోమరణిస్తాడు. అతన్ని నీవుకూడా వెతుకుతావు. ఉత్తముని తల్లి సురుచి తన కొడుకు వెదుకుతూ వెళ్లి కార్చిచ్చుకు ఆహుతి అవుతుంది. నీవు నీ తండ్రిరాజ్యాన్ని జనరంజకంగా పాలిస్తావు. ఆ తరువాత సప్తఋషులు, గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు జ్యోతిశ్చక్రము దేనికి ప్రదక్షిణం చేస్తుంటారో అటువంటి ‘‘ధ్రువక్షితి’’అన్న ఉన్నతోన్నత స్థానానికి చేరుకుంటావు. ప్రళయకాలంలోను ఆ ధ్రువక్షితి ప్రకాశిస్తూ ఉంటుంది’’ అని వరం ఇచ్చాడు. తిరిగి గరుడవాహనారూఢుడై వైకుంఠానికి వెళ్లిపోయాడు.
ఇన్ని పొందిన ఆనందం ధ్రువునిలో కొద్దిసేపు ఉంది. ఆ తరువాత ‘అయ్యో ! నేనెంత వ్యర్థజీవుణ్ణి. దుర్లభమైన దర్శనం లభ్యమైనా నేను అశాశ్వతమైన కోరికలను కోరాను. నేను ఎంత తప్పు చేశానో’’అని వ్యధ చెందాడు. ఆ వ్యధలో అక్కడే నిల్చుండిపోయిన ధ్రువుని నారదుడు చూశాడు.
దగ్గరకు వచ్చాడు.‘నాయనాధ్రువా! నీవు కోరుకున్న వాసుదేవుని కనులారా చూశావు కదా. నీ కోరికను సఫలం చేస్తానని ఆ భగవంతుడు వరమిచ్చాడు కదా. అదుగో ఈవిషయం తెలుసుకొన్న ఉత్తానపాదుడు నీ తండ్రి సర్వసంబరాలతో నిన్ను ఆహ్వానించడానికి బ్రాహ్మణ పురోహితులతో వస్తున్నాడు. ఇపుడు ఎందుకు దుఃఖిస్తున్నావు’’అని అడిగాడు.
‘స్వామీ! నేను నా జీవితాన్ని వృథా కాలయాపన చేశాను. ఎవరికీ లభ్యంకాని ఆ శ్రీహరి దర్శనం నాకు లభ్యమైంది. కాని నేను వ్యర్థపర్చుకున్నాను. అశాశ్వతమైన కోరికను కోరి నేను నా జన్మను వృథా పర్చుకున్నాను’అని ధ్రువుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి ‘ధ్రువా నీకు తపస్సుకు ముందు మీ తల్లితో మాట్లాడినపుడు మన పూర్వజన్మ కర్మల వల్లే ఇప్పుడున్న స్థితి ని అనుభవిస్తున్నాము అని చెప్పిందికదా. మరి నీవు కూడా దానివల్లనే ఈ కోరికను కోరుకున్నావు దీనికై పరితపించడం ఎందుకు. నీవు కోరిన కోరిక తీరిన వెంటనే ఆ పరమేశ్వరుని సన్నిధిలోనే ఉంటావు కదా’అన్నాడు. ఆశ్చర్యవదనంతో చూస్తున్న ధ్రువునికి నారదుడు ఇలా చెప్పాడు.
ధ్రువా నీవు క్రితం జన్మలో ఒక సదాచారం తెలిసిన బ్రాహ్మణుడివి. నీవు నియమ నిష్టలతో ఆచారాన్ని పాటించేవానివి. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని సదా సేవిస్తూ ఉండేవాడివి. నీకు ఒక రాజకుమారుడు స్నేహితుడు అయ్యా డు. అతడు కాల క్రమంలో రాజు అయ్యాడు. అపుడు కూడా నీ స్నేహితుడే. నీవు కూడా ఆ రాజుగారి కార్యకలాపాల్లో పాల్గొనేవానివి. అపుడు నీలో రాజుగావాలని కోరిక ఉదయించింది. దీనికోసం అపుడు కూడా దేవుని ప్రార్థించావు. ఆ కోరిక నీ మరణసమయంలో బలంగా ఉండేది. క్షత్రియుడినై భూమిని పరిపాలించాలని అనుకొనేవాడివి. సదాచార సంపన్నుడివైన నీ కోరికను భగవంతుడు తీర్చాలని అనుకొన్నాడు. నేడీ జన్మలో నీకీ పరిస్థితులను కల్పించాడు. దానికి కూడా నీవు ఆ దేవాదిదేవునే శరణుపొందావు కనుక నీకు ధ్రువక్షితి అన్న ఉన్నతోన్నత స్థానాన్ని ఇచ్చాడు. కనుక నీవు ఆ భగవంతుని నామాన్ని సదా స్మరిస్తూ ధర్మాన్ని అతిక్రమించకుండా భూమిని పాలించు. అదిగో వెళ్లు మీ తండ్రి నీకోసం అర్రులు చూస్తూ ముందు వస్తున్నాడు అని నారదుడు ధ్రువునికి హితోపదేశం చేశాడు.
ఉత్తానపాదుడు అఖిలసన్నాహాలతో ధ్రువునికి ఎదురేగి తీసుకెళ్లి సర్వభూమండాలానికి మహారాజును చేశాడు.
చూశారా! కోరికలున్నా, పుణ్యమున్నా, పాపమున్నా సరే జన్మపరంపరలో ఓలలాడవలసిందే సుమా.

-డా. రాయసం లక్ష్మి