Others

మనమేం చేస్తున్నాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదం మనకు పరమ ప్రమాణం...
మరి వేదం చెప్పినట్లు మనం నడుచుకుంటున్నామా?
సహనంతో నలుగురితో కలసి నడువమని, నలుగురితో ఐకమత్యంతో ఉండమని, నలుగురితో మాట్లాడమని, జీవించమని, ప్రయాణించమని ఋగ్వేదం చెబుతుంది.
మరి ఇలా ఉంటున్నామా మనం ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది. చీటికి మాటికి కోపం వస్తుంది. కోపం రావడం సహజమే. కాని అది తాటాకు మంటలాగా చప్పున ఆరిపోవాలి. కోపం వల్ల ఎదుటివారు కాని తనకు తాను కాని మాడిపోకూడదు. అపుడు మాత్రమే నలుగురితో కలసి మాట్లాడుతాం, నడుస్తాం.. ప్రయాణిస్తాం...
దోషం లేని కర్మ చేయమని యజుర్వేదం చెబుతోంది.
మరి దీన్ని ఆచరిస్తున్నామా మనం...
దోషం అంటే తప్పు చేయడం కాదు స్వార్థంతో ఆలోచించడమూ దోషమే. మనమేమి పనిచేసినా అది నలుగురికీ ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఒకవేళ అలా వీలు కాకపోతే కనీసం మనం చేయబోయే పనివల్ల ఎవరికీ నష్టం రాకుండా ఉండాలి... అపుడే యజుర్వేదాన్ని మనం అనుసరిస్తున్నట్టు అవుతుంది.
కాలంతో పాటు కదిలే మనిషి లో మార్పులు సహజం. ఊసరవెల్లి, బల్లులు ప్రకృతి రంగులను బట్టి మారుతూ ఉంటాయి. అసలు మారుతూ ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు. ప్రతినిమిషంలో ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా తన్ను తానుమార్చుకుంటూ సరికొత్త ఆలోచనలతో ముందుకు పోతూ ఉంటే ఆధునికత్వం ప్రతిచోట కనిపిస్తుంది. అపుడే -
ఓమ్ సహనావవతు
సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతస్తు
మావిద్విషావహై
ఓమ్ శాన్తిః
మమ్ము రక్షించుగాక.. మాకు పోషణము కలుగజేయుగాక.. మాకు విద్యావిషయమునందు సామర్థ్యము కలుగుకాక.. తేజస్సుగల మాకు బ్రహ్మ విద్య తెలియబడినదగుగాక.. మాలో పరస్పరము ద్వేషము లేకుండుగాక.
- యజుర్వేదం