Others

తరగతి ఓ వడపోసే యంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది ప్రతి అంశాన్ని వడపోస్తుంది. ముద్రించిన ప్రతి అక్షరం నిజం కావాల్సిన అవసరం లేదు. పుస్తకంలో ఉండే ప్రతి అక్షరాన్ని వడపోసే లక్షణాన్ని ఉపాధ్యాయుల్లో పిల్లల్లో కలిగిస్తుంది. అందుకే తరగతి గదికి వెళ్లకముందు ఉపాధ్యాయుడు ఆ అంశానికి సంబంధించిన ప్రతి పుస్తకాన్ని చదవాలి. విమర్శించుకోవాలి. విమర్శన అంటే విశే్లషణ చేయడం, విడమరిచి చెప్పడం. ఆ అంశానికి సంబంధించిన సత్యాసత్యాలు బేరీజు వేసుకోవడం జరగాలి. అదేమాదిరిగా విద్యార్థి కూడా ముద్రించిన ప్రతి అక్షరాన్ని బట్టీ పట్టకూడదు. విద్యార్థులు తరగతి గది నేర్పిన వడపోతను ఉపయోగించాలి. దాని సత్యానే్వషణ కూడా చేసుకోవాలి. ఇది సమాచార యుగం కాబట్టి ఎన్నో పుస్తకాలు వస్తాయి. ఏ పుస్తకాలు చదవాలో విద్యార్థులు గుర్తించగలగాలి. మన ఆలోచనలను నులిపివేయడానికి గైడ్స్ వస్తాయి. గైడ్ సమస్యకు పరిష్కారంకన్నా మన పరిష్కారాన్ని మన మేధస్సులో దూర్చే ప్రయత్నం చేస్తుంది. దీనివలన మన ఆలోచనలపై మనకే నమ్మకం లేకుండాపోతుంది. పత్రికల్లో వచ్చే ప్రతి మాటను మనం మన ఆలోచనలతో, ఆలోచనాపలకపై రాసి చూసుకోవాలి. తరగతిగది మనకిచ్చే సద్గుణాలలో విమర్శన అదే పుస్తకంలోని సమాచారాన్ని వడపోస్తుంది. సమాచారాన్ని వడపోసేది తరగతి గది. ఈ పవిత్రతను ఉపాధ్యాయులు, విద్యార్థి కాపాడిననాడే అది నాలుగు కాలాలు తన పవిత్రతను చాటగలుగుతుంది. తరగతి గది వడపోత లక్షణాన్ని కాపాడే సంరక్షకులుగా ఉపాధ్యాయులు నిలవాలి.
అనామకుడే సాంస్కృతికి అణువు
ఈనాడు ఆధునికతతో పరుగులు పెడుతున్న నేటితరం యువతకు నైతిక, సామాజిక స్పృహ కలిగించాలనే ఉద్దేశంతో ప్రతిరోజూ తరగతి గదిలో గుర్తు తెలియని ఏవో ఒక విద్యార్థి కొన్ని సూక్తులు రాస్తాడు. దీన్ని మనం ఈ రోజుకు ఆలోచించవలసినది (్థట్ ఫర్ ది డే అనుకుంటాం. తరగతి గదిలో శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని రగిలించాలనే ఉద్దేశంతో కొందరు ‘్థట్ ఫర్ ది డే’ అన్న సామెతను రాస్తారు. ఇది ఉపేక్షించే అంశం కాదు. ప్రతివారు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతివారం తన ఆలోచనను బహిర్గతం చేస్తారు. ఇలాంటి సూక్తులు చినికి చినికి ఆలోచనల జడివానగా మారతాయి. అవే తరగతి గది గడపదాటి మార్నింగ్ అసెంబ్లీ వరకు వస్తుంది. దానినే ప్రధానోపాధ్యాయుడు వివరిస్తాడు. అది అన్ని తరగతుల అంశంగా మారిపోతుంది. ఎవరో తెలియని వ్యక్తి అనామకుడు కల్పించినటువంటి భావన ఒక జాతి కల్చర్‌గా మారిపోతుంది. తరగతి గది కూడా తనకు తెలియకుండానే దేశ సంస్కృతిలో భాగస్వామి అయిపోతుంది. ప్రతి తరగతి గది జాతి ఆలోచనలో ఒక అణువే కావచ్చును. జాతి కల్చర్‌ను నిర్మించడంలో తాను కూడా భాగస్వామినవుతున్నానని తరగతి గది భావిస్తోంది. అందుకే ‘జాతి శీలం నిర్మిచబడేది తరగతి గదిలోనే’ అని కొఠారి అన్నారు.

-డా.చుక్కా రామయ్య