భక్తి కథలు

పశ్చాత్తాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవూరిలో గౌతముడు అనే బ్రాహ్మణుడు స్వధర్మం విడిచి చెడు సావాసాలకు లోనైనాడు. సాత్వికాహారం మానివేసాడు. మాంసాదులు తినసాగాడు. డబ్బు కోసం అడవిలో వర్తకులతో తిరుగుతుండేవాడు. ఒకనాడు అరణ్యానికి వెళ్లాడు. అక్కడ వానిని ఒక మదపుటేనుగు తరుముకొచ్చింది. దారి తప్పి అలసటతో ఒక మర్రిచెట్టు క్రింద దాగున్నాడు. ఆ మర్రిచెట్టు పైన నాడీజంఘడు అనే బకముఉంది.ఆనాడీజంఘుడు గొప్ప ధార్మికుడు. ఆయన అలసి ఉన్న ఆ బ్రాహ్మణుని అతిథిగా తలచాడు. గౌరవించి అతిథి మర్యాదలు చేశాడు. మాటల్లో బ్రాహ్మణుడు తాను డబ్బుకోసం శ్రమపడుతున్నానని చెప్పాడు. అతని కథ విని జాలిపడి ‘‘స్వామీ నా వద్ద ధనం లేదు, నా మిత్రుడు విరూపాక్షుడనే దనుజుడు మధువ్రజపురంలో ఉన్నాడు. వానివద్దకు వెళ్ళు, నీకు ధనమిస్తాడు’’ అని చెప్పాడు.
ఆ బ్రాహ్మణుడు మధువజ్రపురం వెళ్లి విరూపాక్షుని కలిశాడు. విరూపాక్షుడు మంచి బుద్ధిశాలి. అతడు వీనిని చూడగానే వీడు పరమ దుర్మార్గుడు, నీచుడని గ్రహించాడు.కాని మిత్రుని మాట కోసం బ్రాహ్మణునికి ధనమిచ్చి పంపాడు. కాని, విరూపాక్షుడు ఇచ్చిన ధనం తీసుకుని ఆ బ్రాహ్మణుడు తిరుగు ప్రయాణంలో తనకు సాయం చేసిన నాడీజంఋని పట్టుకొని ఆకలివేసిందని బ్రాహ్మణుడు చంపి తినేశాడు. మరునాడు ఈ విషయం విరూపాక్షునికి తెలిసింది. దీనికారణం బ్రాహ్మణుడే అయ ఉంటాడని తెలుసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడే అని అనుకొన్నాడు. వెంటనే వానిని పట్టి బంధించి తెమ్మనమని ఆజ్ఞాపించాడు. ఆ బ్రాహ్మణుని బంధించి తెచ్చారు. విరూపాక్షుడు తన మిత్రునికి అంత్యక్రియలు జరిపిద్దామని మిత్రుని కళేబరాన్ని చితిపై పెట్టి నిప్పు అంటించబోయే సమయంలో ఇంద్రుడు వచ్చాడు. తన మిత్రుడిని బ్రతికించమని విరూపాక్షుడు పార్థించాడు. అపుడే ఆ చితికి సమీపంలో సురభి తన దూడకు పాలిస్తుండగా ఆ దూడ మూతినుండి పాలనురుగు గాలికి ఎగిరివచ్చి చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడుకి ప్రాణం తిరిగివచ్చి లేచాడు. అదంతా బ్రహ్మదేవుని ప్రభావం అనివారు తెలుసుకున్నారు. నాడీజంఘుడు బ్రాహ్మణుడు బధించబడి ఉండడం చూసి వానికి విధించబడిన శిక్ష తెలుసుకొని వానిని క్షమించి విడిచిపెట్టమని వారిని ప్రార్థించి వానిని విడిపించాడు.పైగా ఆ బ్రాహ్మణుడికి ధనమిప్పించి పంపాడు నాడీజంఘుడు.
ఇలా కృతఘ్ననిని కూడా మన్నించిన నాడిజంఘుని అందరూ ప్రశంసించారు. దాన్నిచూసిన విప్రుడు తను చేసిన ద్రోహం తెలుసుకొని పశ్చాత్తాప పడి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని అనుకొన్నాడు. పశ్చాత్తాపం చెందితే మనిషిలో మార్పు తప్పక వస్తుందని నాఢీజంఘుడు అక్కడి వారికి చెప్పాడు.
*