Others

గీతాబోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వకాలికమైనది, సార్వలౌకికమైనదీ భగవద్గీత. ఇది ఏ ఒక్క వ్యక్తికి, జాతికి, వర్గానికి, వాదానికి, దేశానికికే కాదు ఒక్క కాలానికి సంబంధించినది కాదు. ఆ గీత -
మమైవాంశో జీవలోకే జీవ భూతః సనాతనః
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి (15-7)
మానవులందరూ ఈశ్వరుని సంతానం అని చెబుతోంది. కేవలం మనుష్యులేంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ దేవుని సృష్టే కదా ఇది. కాని మనుష్యులంటే ఎవరు అనేది కూడా గీతనే చెబుతోంది.
దైవం సృష్టించిన ప్రాణికోటిలో మనుష్యులే మాట్లాడగలరు. వీరిలో రెండు జాతులున్నాయి అంటోంది గీత.
ఆ జాతిలో మనమెవరమో మనమే కనిపెట్టాలి ...
ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవచ
దైవో విస్తరశః ప్రోక్త అసురం పార్థమే శృణు... (16-6)
ఎవరి హృదయంలో దైవీ గుణాలు పనిచేస్తుంటాయో వారు దేవతలు ఎవరి హృదయంలో అసురీ గుణాలు పనిచేస్తుంటాయో వారు దానవులు
ఈ రెండు రకాలు మాత్రమే ఉన్నాయి. మరి మనం దేవతలమా లేక దానవులమా ఎవరికి వారే తేల్చుకోవాలి.