Others

పుణ్యకార్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి ధర్మరాజు పుణ్యక్షేత్రాలను చూచి రావాలనుకొన్నాడు. దానివల్ల మనశ్శాంతి వస్తుంది. అట్లానే చేసిన పాపం నశించి పుణ్యం వస్తుంది అనుకొన్నాడు. ఈ విషయమే శ్రీకృష్ణునితో మాట్లాడుదామని వెళ్లాడు. ధర్మరాజు కృష్ణుడు మాట్లాడుకునేటపుడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు కృష్ణునికి నమస్కరించాడు.
కృష్ణుడు విషయమేమిటని అడిగితే ఇలా చెప్పాడు
‘కృష్ణా! మేమంతా పెద్దవారం అయిపోతున్నాం కదా. కాలు చేయి ఆడే స్థితిలోనే నాలుగు పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యం సంపాదిద్దాం అనుకొంటున్నాం. మీతో ఈ విషయం చెప్పి రేపు పుణ్యక్షేత్ర దర్శనంకోసం బయలుదేరుదామని మీ దగ్గరకు వచ్చాం’ అన్నాడట.
కృష్ణుడు వెంటనే ‘మంచిది అలానే వెళ్లిరండి. ఎట్టాగూ వెళుతున్నారు కదా అట్లానే నాకొక సాయం చేయండి. నా దగ్గర గుమ్మడికాయ ఉంది. దాన్ని తీసుకొని మీరు ఏ తీర్థమాడినా దీన్ని స్నానం చేసుకొని రండి. గుడిలో మీరు దర్శనానికి వెళ్లినా దీన్ని గూడా తీసుకొని వెళ్లండి’ అన్నాడట.
ఆయన ఆశ్చర్యబోయి ‘ఇదేంటి కృష్ణా! ఇలా అన్నావు’ అన్నాడాయన
‘ఏం లేదు. నిన్న ఒక జ్యోతిష్యశాస్త్రం చదువుకున్నవారు వచ్చారు. ఆయన ఈ గుమ్మడికాయ చేదుగా ఉండడానికి కారణంమేమిటి అని అడిగితే పూర్వజన్మలో పాపం చేసినందువల్ల ఈ జన్మలో కాయగా పుట్టినా చేదు రుచిని కలిగి ఉంది అని చెప్పాడు. మీరు పుణ్యంకోసం తీర్థాటన చేస్తున్నారు కదా. మరి దీనికి కాస్త పుణ్యం వస్తుందని మీకు ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణుడు.
సరే అని ఆ బ్రాహ్మణుడు గుమ్మడికాయను తీసుకొనివెళ్లాడు. ధర్మరాజు ఇదంతా చూస్తున్నాడు.
పదిరోజుల తర్వాత మళ్లీ ధర్మరాజు, కృష్ణులు ముచ్చట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆ గుమ్మడికాయను తీసుకొని వెళ్లిన విప్రుడు వచ్చాడు. గుమ్మడికాయను తిరిగి కృష్ణుడిని ఇచ్చాడు. కృష్ణుడు దాన్ని చూసి తరిగి తిని చూద్దాం, చేదు పోయిందో లేదో చూద్దాం అన్నాడు. వెంటనే పరిచారికుడు వచ్చి గుమ్మడికాయను కోసాడు అది కాస్త బూజు పట్టిపోయింది. అసలు పనికిరాకుండా పోయింది.
కృష్ణుడు ఆశ్చర్యంగా అయ్యో ఇదేమి పుణ్యం రావల్సింది పోయి మరింత పాపం మూటకట్టుకున్నట్టుగా చెడిపోయిందే అని వాపోయాడు.
ఆ బ్రాహ్మణుడు మారు మాటలేకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ధర్మరాజుకు విషయం అర్థమైంది. తాను అడుగదల్చుకున్నది అడగకుండా నేను తీర్థాటనవల్ల పుణ్యం రాదని ఏదైనా పుణ్యకార్యం ఆచరిస్తేనే వస్తుందని తెలుసుకొన్నానని చెప్పి కృష్ణుని దగ్గర సెలవు తీసుకొన్నాడు.
చూశారా మరి పుణ్యకార్యాలు చేస్తారా... చూస్తారా మీరే నిర్ణయించుకోండి.