Others

మోక్షం అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మికవాదులల్లో చాలామంది ముక్తి కోసం ఎదురుచూస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు అంటే జన్మరాహిత్యానికి, ముక్తినొందటానికి అంటుంటారు. ఈ ముక్తిని పొందాలంటే ఏం చేయాలి- కొంతమంది సన్యాసం స్వీకరించి నిస్సంగుగా ఉంటే ముక్తి వస్తుంది అంటారు. కాషాయ వస్త్రాలు ధరించి నిస్సంగుగా ఉండేవారంతా ముక్తిని పొందుతున్నారా? అంటే చెప్పలేము. ముక్తిని గురించి మనుధర్మశాస్త్రం ఏం చెబుతుందోచూద్దాం.
మనుధర్మశాస్త్రం
ధృతిఃక్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్
దశలక్షణకం ధర్మమనుతిష్ఠన్ సమాహితః
వేదాన్తం విధివచ్ఛృత్వా సన్న్యసేద నృణోద్విజః
ధైర్యం, ఓర్మి, దేహేంద్రియాల్ని స్వాధీనంలో నుంచటం, ఇతరుల సొమ్ము నపహరింపకుండటం, బాహ్యాభ్యంతర శుద్ధి , ఇణద్రియ నిగ్రహం, శాస్త్రార్థాల్ని గ్రహించదగ్గబుద్ధి, ఆధఆయత్మ విద్య, సత్యవచనం, క్రోధరాహిత్యం అనే ఈ పది ధర్మానికి గుర్తులు ఈ పదిధర్మాలను ఆచరించేవాడే మోక్షానికి అర్హుడవుతాడు అని మనువు చెబుతున్నాడు.
మరి లెక్కకు మించిన జనాభా పెరుగుతున్న ఈ కలియుగంలో ఈ పదిధర్మాలను ఆచరించేవారు ఉన్నారంటారా? ఎవరికి వారు ఈ పది లక్షణాలు వారిలో ఉన్నాయా అని ఒక్కసారి పరిశీలించుకొంటే లెక్క సులభంగా వస్తుంది కదా!