Others

ఆశ ఖరీదు అణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తా: వెర్రినాయనవి. అలాంటివి మానెయ్.. అందరూ ఋడుసుకుంటారు. మనుషుల్లోని మంచినీ, లోకంలోని ఆనందాన్నీ బొమ్మలు వేసి చూపించు చేతనయితే.
ఇం: ఆయన బొమ్మలు కిటికీలోంచి తొంగిచూస్తే నాకూ అలాగే అనిపించింది. ఆర్టిస్టుగారూ! మరచిపోయిన ఆశల్ని నూతనంగా జ్ఞాపకం చేసే బొమ్మల్ని వేయగలరా?
యు: అందుకు నాలో కొన్ని ఆశలుండాలి గదా!
ఇం: మీలో ఏ ఆశలూ లేవా?
యు: లేవు. ఈ రాత్రితో అన్ని ఆశలూ హరించుకుపోయాయ. ఇక నిలబడే శక్తి లేదు. వెళ్లిపోవాలని వుంది.
తా: ఎక్కడికి?
యు: అవతలిగట్టుకి.
కృ: నాకూ అలాగే అనిపిస్తోంది. ఎవరైనా సహాయం చేస్తే బాగుండును.
తా: ఇక్కడికి ఇద్దరయ్యారు. నువ్వు ఇందిరా?
ఇం: అన్నయ్య రాగానే నాకు నిద్రపోవాలని ఉంది.
యు: తాతగారూ! ఆ... అటు చూడండి... ఎదురుగా ఆ లాంతరు స్తంభం పక్క నీడలా!
తా: నీడ అయుంటుంది!
యు: నీడ వెనుక వస్తువుండాలి కదా! గంట నించీ చూస్తున్నాను. నాకేమిటో చిత్రంగా వుంది. అదేమిటో వెళ్లి చూద్దావా?
(మోటారుకారు అకస్మాత్తుగా బ్రేక్ వేసి ఆగిన చప్పుడు)
యు: ఇం:- కృ: అరె! ఏవిటిది?
తా: ఏక్సిడెంటులా వుంది! వెళదాం పదండి!
(‘పదండి! పదం! పాపం! ఎంత పని!’ అనుకుంటూ వెడతారు)
తా: ఎవరదీ! కారువాడు పారిపోయాడే!
ఇం: అయ్యో! అయ్యో! మా అన్నయ్య తాతగారూ!
కృ: మీ అన్నయ్యా!
యు: ఎంతపనీ!
ఇం: అన్నయ్యా! మాటాడవేం అన్నయ్యా! ( గట్టిగా, భయంగా) అన్నయ్యా!
తాత: భయం లేదమ్మా! ఉండు. ఏం నాయనా?
అన్నయ్యా: (నెమ్మదిగా) భయం లేదు ఇందిరా. దెబ్బతగలలేదులే. నడుం బెణికింది. అంతే. కారుకి తగలలేదు. ఇవతలే పడిపోయాను.
తా: నెమ్మదిగా లేచి రెండుగులు వెయ్యి. నాయనా! నువ్వు కొంచెం చెయ్యి అందించు.. ఇక్కడ రుూ పచ్చికమీద కాస్సేపు కూర్చుందాం రండి!
ఇం: ఏవిటన్నయ్యా ఇదంతా?
అన్న: చెడిపోయింది. అంతా చెడిపోయింది. ఆ కారు కిందపడి హాయిగా చచ్చిపోదాం అనుకున్నాను. ఫలించలేదు. వెంట్రుకవాసిలో తప్పిపోయింది. ఇంకోమారు ప్రయత్నించి చూస్తాను.
తా: ఉద్ధరిస్తావ్
కృ: అక్కడకి మీతో యిద్దరం అవుతాం. నేనూ అలాంటి పని చేద్దామనే వీధిలోకి వచ్చాను.
యు: ఇద్దరు కాదు ముగ్గురం - ఇందాకటినుంచి నా ప్రయత్నమూ అదే.
తా: పరమేశ్వరా! ఏవి మేళం యిది! ఏవొచ్చింది రుూ రాత్రి మీ అందరికీ!
అ: ఇంకా ఏం రావాలి తాతగారూ? మా కుటుంబం సంగతి తెలీదా మీకు?
కృ: తాతగారికి నా సంగతి తెలుసు.
యు: నా సంగతి ఎవరికీ తెలీకపోయినా, నాకు బాగా తెలుసు.
తా: తెలుసు నాయనా తెలుసు, మీ అందరి సంగతీ తెలుసు. ఈ నాలుగుముక్కలూ వినండి. మీరంతా జీవితాల్లో దగాపడ్డ తమ్ముళ్ళూ చెల్లెళ్ళున్నూ. బతకడం అంటే మీకు భయం ఉంది. మనవన్నీ చల్లారిపోయిన సంసారాలు. అవును. అంతమాత్రం చేత?
అన్న: పరిస్థితులన్నీ ఒక్కసారి చీకటయిపోతే ఏం చెయ్యాలి తాతగారూ!
తా: వెర్రివాడా, చావటానికి లక్ష కారణాలుంటే బతకడానికి కోటి కారణాలుంటాయి. నా సంగతే తీసుకోండి. గంపెడు సంసారం, అందరూ మూర్ఖులు. స్వార్థపరులు, జబ్బులు, అన్నీ సమస్యలే. కాని కాని ఏది ఏమైనా బతకడంలో ఎంతో మాధుర్యం ఉంది నాయనా! లోకాన్ని పోల్చుకోండి. మీలోని జీవన వాంఛని పోల్చుకోండి! ముందు మీకందరికీ కావలసింది ధైర్యం. మనలో ఏ ఒక్కరి కుటుంబం తీసుకొన్నా నికృష్టంగానే ఉంది. అంతమాత్రాన మనల్ని మనమే అసహ్యించుకుంటామా? జీవితంలోని ఆనందాన్ని పోల్చుకుందుకీ. దుఃఖాన్ని సానుభూతితో చూడడానికీ ప్రయత్నించండి. నిస్సహాయతని అసహ్యించుకొనే మనుషులున్నారు లోకంలో.

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)