Others

యాజ్ఞసేని-36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా నిలచియున్న ద్రౌపదిని ప్రేమతో తాకిన ధర్మజుడు ‘‘ద్రుపద రాజపుత్రీ! విధి నిర్ణయించిన ప్రకారం నేను నిన్ను పొందగలిగాను. భర్తగా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించగలనని నీకు వాగ్దానం చేస్తున్నాను. ధర్మాన్ని అతిక్రమించక ఎప్పుడూ నీకు సంతోషాన్ని సుఖాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాను. కష్టసుఖాలలో నీకు చేదోడు వాదోడుగా వుంటాను’’’ అని అన్నాడు.
మరునాడు ద్రౌపది దేవర్షి నారదుడు చెప్పినట్లుగానే కన్యగానే వున్నది.
రెండవనాడు ద్రౌపది శాస్త్రోక్తంగా ‘్భమసేనునితో’ పాణిగ్రహణం చేసింది. ఇద్దరూ అగ్నికి ప్రదక్షిణచేశారు. భీమసేనుడు ద్రౌపదితో ఏకాంతంగా వున్నపుడు- ‘‘స్వామీ! అతిబల సంపన్నుడవైన నీకు ఈ పాంచాలి నమస్కరిస్తున్నది. మీ దయవలన నాకు ముందు ముందు ఎలాంటి కష్టము కలుగకుండా కాపాడవలసిన బాధ్యత ఒక భర్తగా తమపై వున్నది’’ అని వినయంగా అన్నది.
సాధ్వీ! ద్రౌపదీ! ఎల్లప్పుడూ భార్యను కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత భర్తదే. నిన్ను ఎవరైనా అవమానపరచినా, బాధించినా వారు నా నుండి తప్పించుకొనలేరు. నా బాహుబలంతో వారిని నిర్జించి నీకు సంతోషాన్ని కలిగిస్తానని వాగ్దానం చేస్తున్నాను’’ అని అన్నాడు. రాత్రి గడిచింది.
మూడవనాడు అర్జునుడు ద్రౌపదిని పాణిగ్రహణం చేశాడు.
తన చిరకాల వాంఛ ఫలించినందులకు ద్రౌపది అమితానంద పరవశురాలై వున్నది. మానవ బలహీనత ఆమెయందు కొట్టవచ్చినట్లుగా కనిపిస్తున్నది. తాను ఐదుగురు భర్తలకు భార్యననే మాట ఆనాడు మరచినట్లున్నది. ఎవరికొరకై తన తండ్రి తనను యజ్ఞ కుండం నుండి పొందాడో, ఆ కోరిక ఈనాటికి నెరవేరిందని హృదయం సంతోషంతో నిండింది. అయితే ఒక్క విషయంలో మాత్రం అనుకున్నది నెరవేరలేదు. తాను కేవలం అర్జునుడితో మాత్రమే పాణిగ్రహణం చేయవీలుబడలేదు. స్వయంవరానికి ముందు తన మనసు అర్జునుడికోసం తహతహలాడింది. స్వయంవరానికి అర్జునుడు వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి తన పాణిని గ్రహిస్తాడని ఆశతో ఎదురుచూసింది. తరువాత జరిగిన పరిణామాలన్నీ తన కళ్ళముందు చక్రంలోని ఆకులా గిరగిరా తిరిగింది. గతం అంతా ఒక్కసారి నెమరువేసుకుంటూ పరధ్యానంలో నిలబడి వున్న ద్రౌపదిని చూచి అర్జునుడు- ‘‘యాజ్ఞసేనీ! నిన్ను భార్యగా పొందటం నిజంగా సంతోషాన్ని కలిగిస్తున్నది. నీ మనసులో ఏదో ఆలోచిస్తున్నట్లున్నది. నీ తండ్రిని బంధించి గురుదక్షిణగా ఇచ్చినందులకు నాకు బాధ కలిగినా, అప్పుడు నేను గురువాజ్ఞకు బద్ధుడను. ఒక శిష్యునిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను’’ అని అన్నాడు.
‘‘్ధనుర్ధారులందరిలో శ్రేష్ఠుడా! ద్రుపద రాజకన్య ఈ యాజ్ఞసేని మీకు సవినయంగా నమస్కరించుచున్నది. నా తండ్రి దేనికొరకై నన్ను పొందగలిగినాడో ఆ కోరిక నేటితో ఫలించింది. అది నెరవేరినందులకు సంతోషంగా ఉన్నది’’ అని సిగ్గుతో తలవంచి నిల్చున్నది.
అర్జునుడు ద్రౌపదిని దగ్గరగా చేరదీశాడు. ‘‘ఒక భార్య భర్తనుండి సదా దేన్ని ఆశిస్తుందో దానిని నీవు పొందగలవని వాగ్దానం చేస్తున్నను’’ అని అన్నాడు.
ఆ రాత్రి గడిచింది.
నాల్గవనాడు ద్రౌపది వివాహం యధావిధిగా నిర్వహింపబడింది.
ద్రౌపదిని నకులుడు పాణిగ్రహణం చేశాడు.
ఆనాటి రాత్రి ద్రౌపది నకులునితో ‘‘ఈ ద్రుపద రాజకన్య తమకు సవినయంగా నమస్కరించుచున్నది. భార్యగా తమకు సేవ చేయగల భాగ్యం లభించినందులకు ఆనందంగా వున్నది. ఎల్లవేళలా నాకు చేదోడు వాదోడుగా వుండగలరని ఆశించుచున్నాను’’ అని అన్నది.
సౌభాగ్యవతీ! సౌందర్యరాశివైన నిన్ను భార్యగా పొందటం సంతోషంగా వున్నది. భర్తగా నేను చేయదగు విధులను నిర్వర్తించి నీకు ఆనందాన్ని చేకూర్చగలనని మాటనిస్తున్నాను’’ అని అన్నాడు నకులుడు.
తాను అతి సుందరాకారుడునే గర్వంగలవాడు నకులుడు. అతిలోక సుందరి అయిన ద్రౌపది తనకు భార్యగా లభించినందులకు ఆనందపడ్డాడు.
ఆనాటి రాత్రి గడిచింది.
అయిదవనాడు ద్రౌపది వివాహం సహదేవునితో జరిగింది.
ద్రౌపది సహదేవులు పాణిగ్రహణం చేశారు.
అగ్నికి ప్రదక్షిణలు చేశారు.
నాటి రాత్రి ద్రౌపది ‘‘పాంచాల రాజపుత్రి అయిన ఈ ద్రౌపది తమకు నమస్కరించుచున్నది. భార్యగా మీకు సేవలందించగల అవకాశం లభించినందులకు తృప్తి చెందుచున్నాను. సదా నాకు రక్షణగా వుండి కాపాడగలని కోరుచున్నాను’’ అని అన్నది.
‘‘రాజకుమారీ! ద్రౌపదీ! నిన్ను భార్యగా పొందటం సంతోషాన్ని కలిగిస్తున్నది. నేను భర్తగా నా కర్తవ్యాన్ని నిర్వహించగలనని మాట ఇస్తున్నాను’’.
ఆనాటి రాత్రి గడిచింది. ద్రౌపది కన్యగానే వున్నది.
- ఇంకా వుంది