Others

భారతమాతకు జేజేలు..(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో స్వర్గీయ ఎన్.టి.రామారావు నటించిన ‘బడిపంతులు’ చిత్రంలో భారతదేశం గొప్పతనంపై ఆచార్య ఆత్రేయ రాసిన పాట ప్రతి ఒక్క భారతీయుని గుండెను తాకి దేశంపై అభిమానం పెంచేలా చేసిన ఈ పాటను ప్రతి ఒక్కరూ పాడుకోవాలి. ‘‘్భరతమాతకు జేజేలు.. బంగరుభూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు’ అంటూ ఘంటసాల చక్కని గొంతుతో ఆలపించిన ఈ పాటలో చరణాలు మన భారతజాతిని కీర్తిస్తాయి. ‘త్రివేణి సంగమ పవిత్ర భూమి - నాల్గు వేదములు పుట్టిన భూమి- గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి’ అంటూ రచయిత మన భారతజాతి వెనె్నల్లా కీర్తించారు. ‘శాంతి దూతగా వెలసినబాపూ, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, విప్లవ వీరులు వీరమాతలు ముద్దుబిడ్డలై మురిసె భూమి’ అంటూ ఆత్రేయ మన దేశం గొప్పతనాన్ని కీర్తించిన ఈ పాటను మన దేశ ప్రజలు అన్ని కులాలు, మతాలవారు పాటిస్తే భారత్ స్వర్ణమై మెరిసిపోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్వర్గీయ ఎన్టీఆర్ పోషించిన బడిపంతులు పాత్ర కన్నీరు కురిపిస్తుంది. స్వర్గీయ జగ్గయ్య, కృష్ణంరాజు పోషించిన పాత్రలు, ఎన్టీఆర్ మనుమరాలిగా బేబి శ్రీదేవి నటన అద్భుతంగా ఉంటుంది.
*
శైలజా.. శైలజా..
రామ్-కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను శైలజ’ చిత్రంలోని పాట ‘శైలజా.. శైలజా...’’ అన్న పాట ప్రేమను మరచివారిని గుర్తుకుతెచ్చేలా ఉండడం ప్రతి ప్రేమికుడు తన ప్రేమ మరచిపోవడంపై హృదయం కన్నీరు అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చి ఈ పాట ‘నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, మనం ఎక్కి దిగిన కోచ్ మారలేదు, నీ మాటల్లో దాగివున్న స్టీత్ మారలేదు, నీవెందుకు మారావే శైలజా’ అంటూ మనల్ని బాధతో రామ్ కన్నీరు కురిపిస్తాడు. ‘సమ్మర్‌లోన సుర్రుమనే ఎండ మారలేదు నీవెందుకు మారావే శైలజా’ అంటూ ప్రియురాలు మరచిపోవడంపై ప్రియురాళ్ళ మనసు మారి రావాలన్పిస్తుంది. ‘నీ ఫొటోను దాచుకున్న పర్సు మారలేదు నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు, నీవెందుకు మారావే శైలజా’ అంటూ రామ్ తన నృత్యంతో మనల్ని ఆనందపరుస్తూ బాధపెడతాడు. ఈ పాట ప్రతి ప్రేమజంటను ఆలోచింపజేస్తుంది.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి