Others

ఆనంద్ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2004 సంవత్సరం అక్టోబర్ 15న విడుదలై ఆరు నంది అవార్డులు కైవసం చేసుకొని, పండిత పామర జనరంజకంగా రూపుదిద్దుకున్న ‘ఆనంద్’ చిత్రం- ఓ నిజ జీవిత ప్రతిబింబంగా నిలిచి అఖండ విజయం సాధించింది. శేఖర్ కమ్ముల కథా, కథనం, కమనీయ దృశ్యకావ్యంగా మలచిన దర్శకత్వ ప్రతిభ ప్రేక్షక హృదయాలను దోచుకున్నాయని చెప్పక తప్పదు. కథారంభంలో రూప అనే అమ్మాయి (కమలినీ ముఖర్జీ) తన తల్లిదండ్రులిద్దరినీ ఒకేసారి ఒకానొక రోడ్డు ప్రమాదంలో కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ విధంగా ఒంటరిగా ఎదిగిన ఆమె జీవితంలోని రాహుల్ అనే వ్యక్తి ప్రేమికుడిగా ప్రవేశిస్తాడు. వారిరువురి ప్రేమ పెళ్లివరకూ వచ్చాక పెళ్లికి కట్టుకోవలసిన చీర విషయంలో చిన్న గొడవ చిలికి చిలికి గాలివానై స్వతంత్ర భావాలుగల రూప వలన ఆగిపోతుంది. అదే పెళ్లికి ఆనంద్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు మిత్రుడితో సహా హాజరవుతాడు. ఆమె జీవితం అలా ఒంటరిగా మారిపోవడానికి తన తండ్రే కారణమని తెలుసుకుని ఆమె జీవితానికి ఎలాగైనా సరే తోడుగా నిలిచి తన తండ్రి ద్వారా అనుకోకుండా జరిగిన తప్పు సరిదిద్దుకొనే ప్రయత్నంలో హీరో ఆమె ప్రేమను గెలవడం టూకీగా చిత్రకథ. సినిమా చూస్తున్నంతసేపు హృద్యమైన కథనం- సన్నివేశ చిత్రీకరణ- నటీనటులు ప్రదర్శించే హావభావ ప్రకటన- సమయోచితంగా సహజంగా సాగిన సంభాషణ ప్రక్రియ- ఇలా దేనికదే చక్కగా అమరి ఆకట్టుకున్నాయి. చిత్రం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని తదుపరి తమిళ భాషలో కూడా తర్జుమా కావటం విశేషం. అటు తర్వాత అంతర్జాతీయ చిత్రోత్సవ ప్రదర్శనలకు ఎంపిక కావటం ఇంకా గొప్ప విషయం. మూస చిత్రాలకు భిన్నంగా లోబడ్జెట్ చిత్రంగా నిర్మించబడిన ఈ చిత్రం నా మనసు దోచుకున్న మంచి కాఫీ లాంటి సినిమా! హ్యాట్సాఫ్ శేఖర్ కమ్ముల!

-మరువాడ భానుమూర్తి, హైదరాబాద్