Others

తెలంగాణ తాకట్టులో ఆంధ్ర సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమకు కావలసిన వౌలిక వసతులు ఏర్పాటు చేస్తే తెలంగాణ వదిలేసి ఆంధ్రకు రావడానికి ఎందరో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, టెక్నీషియన్లు సిద్ధంగా వున్నారు. రాష్ట్రం విడిపోయి నాలుగో ఏడాది గడుస్తున్నప్పటికీ సినీ పరిశ్రమ ఆంధ్ర అంచులక్కూడా తరలిరాకపోవటం వెనుక విశే్లషించుకోవాల్సిన అంశాలు ఎన్నో వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సినిమా పరిశ్రమను తరలించాలనే ఆలోచనలో వుంది. దీనికి కొందరు సుముఖంగా వున్నప్పటికీ
మరికొందరు ససేమిరా అంటున్నారు.

రాష్ట్రం విడిపోయాక సినిమా పరిశ్రమ తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్‌కు నేటికీ రాలేదు. చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ తరలిరాకపోవడానికి కర్ణుడికున్నన్ని శాపాలు సినీ రంగానికున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో సినిమా నిర్మాణం అంతా తెలంగాణలోనే తిష్టవేసుకుపోతోంది. తమకు కావలసిన వౌలిక వసతులు ఏర్పాటుచేస్తే తెలంగాణ వదిలేసి ఆంధ్రకు రావడానికి ఎందరో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, టెక్నీషియన్లు సిద్ధంగా వున్నారు. రాష్ట్రం విడిపోయి నాలుగో ఏడాది గడుస్తున్నప్పటికీ సినీ పరిశ్రమ ఆంధ్ర అంచులక్కూడా తరలిరాకపోవటం వెనుక విశే్లషించుకోవాల్సిన అంశాలు ఎన్నో వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సినిమా పరిశ్రమను తరలించాలనే ఆలోచనలో వుంది. దీనికి కొందరు సుముఖంగా వున్నప్పటికీ మరికొందరు ససేమిరా అంటున్నారు. దీనికి సాంకేతికపరమైన కారణాలు ఎన్నో వున్నాయి. విశాఖలో కేవలం సముద్రం, కొండలు మినహా మంచి లొకేషన్లు కెమెరా కళ్ళకు ఎంత వెదికినా కనిపించవు. అంతకుమించిన ప్రకృతి అందాల సోయగాలు ఆంధ్రాలోని కృ ష్ణానది తీరంలో ఎ న్నో వున్నాయని ద ర్శకులు చెబుతున్నారు.
పరవళ్ళు తొక్కే ప్రకృతి అందాలన్నీ గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోనే వున్నాయని మరికొందరు సినిమా పండితులు విశే్లషిస్తున్నారు. మన నోట్లో మంచి పన్ను వుంచుకొని వేరే చోటికి వెళ్లి ఊడగొట్టుకోమన్నట్లుగా వుందని టెక్నీషియన్లు వాపోతున్నారు. సినిమా పరిశ్రమను రాజధాని పరిధిలోకే తీసుకురావాలని కొందరి మనసులలో వున్నప్పటికీ అధిక శాతం ప్రజలు ముఖ్యమంత్రికి ఎదురుచెప్పలేక వౌనంగా వుంటున్నారనేది బహిరంగ రహస్యం. రాజధాని పరిధిని స్టూడియో నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలెందరో ముందుకువచ్చి సినిమా స్టూడియోలు నిర్మించేందుకు సిద్ధంగా వున్నారనేది సినీజనం ఘోష. సినిమా నిర్మాణానికి కావలసిన వౌలిక సదుపాయాల్లో భాగమైన స్టూడియోలు, ఫిలిమ్‌నగర్, టీవీ కాలనీ- ఇలా ఏర్పాటు చేయగలిగితే కెసిఆర్ జపం మానేసి పరుగెత్తి ఆంధ్ర వొడిలో వాలిపోదామనే మాట హైదరాబాద్ నుండి ఆంధ్ర రాజధానికి పాకింది.
దీనికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే అసాధ్యమేమీ కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోకముందే ముందస్తుగానే 2013లో తెనాలికి చెందిన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు, దర్శకుడు అయన నేను (దోనెపూడి దిలీప్ రాజా) బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని పెదరావూరు ఫిలిమ్ స్టూడియో నిర్మించాను. ఆంధ్ర ప్యారిస్ తెనాలికి మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామీణ నేపథ్యంగల పెదరావూరులో ఆయన పెదరావూరు ఫిలిమ్ స్టూడియో నిర్మించడం జరిగింది. అప్పటి కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఈ స్టూడియోను ప్రారంభించారు. ఒకే భవనంలోనే జైలు, కోర్టు, హాస్పిటల్ తదితర సెట్లు వేసి ఇప్పటికీ చిన్న సినిమాలు, టీవీ సీరియల్స్ నిర్మాణాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. నాకు వున్న పరిచయాల వలన పరిసర గ్రామాల్లోని స్విమ్మింగ్ పూ లు, మండువా ఇల్లు, డూప్లెక్స్ ఇల్లు, రచ్చబండ, తదితర లొకేషన్లను అద్దెకు తీసుకోవడం జరుతుంది.
2013 నుండి 2018 వరకు ఇక్కడ ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎకరాలు స్థలం లేకపోయినప్పటికీ సినిమా
చిత్రీకరణకు కావలసిన కెమెరాలు, లైట్లు, రిప్లెక్టర్లు, జిమీజిబ్ క్రేన్, ట్రాక్ అండ్ ట్రాలీ, రౌండ్ ట్రాలీ, తదిర షూటింగ్ సామాగ్రిని ఏర్పాటుచేశారు. ఇటీవలే ఎడిటింగ్, డబ్బింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్ట్‌ప్రొడక్షన్ అంతా పెదరావూరు ఫిలిమ్ స్టూడియోలోనే పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి ఫిలిం సిటీ నిర్మాణానికి రాజధాని పరిధిలో స్థలం కేటాయిస్తే బ్యాంకుల ద్వారా నిర్మాణాలు జరపటానికి సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి మనవి చేస్తాం. సిఆర్‌డిఎ పరిధిలో ఎక్కడ స్థలం కేటాయించినా బ్యాంకుల ద్వారా పూర్తి స్థాయి స్టూడియో ఏర్పాటుచేయగలం. రాజధాని అభివృద్ధిలో భాగంగా సినిమా పరిశ్రమను రాజధాని పరిధిలో ఏర్పాటుచేసుకోవడానికి ఔత్సాహికులను ప్రభుత్వం చర్చలకు రావలసిందిగా పిలవాల్సి వుంది. పూర్తి స్థాయి సినిమా, టీవీ, నిర్మాణాలు పెదరావూరు ఫిలిమ్ స్టూడియోలో నిర్మించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది.

చిత్రాలు..కోర్టుసెట్ * జైలుసెట్ *డైలీ సీరియల్‌లో ఓ దృశ్యం

-దోనెపూడి దిలీప్‌రాజా, దర్శకుడు కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డ్ సభ్యులు