Others

రకుల్ నమ్మకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో విజయాలతో పాటు, మంచి అవకాశాలను సొంతం చేసుకొంటూ తారాపథంలోకి బుల్లెట్‌లా దూసుకెళుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్. వచ్చిన అవకాశాలను ఏ మాత్రం జారవిడుచుకోకుండా నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకొని క్రేజీ హీరోల సరసన మెరిసిపోతోంది. ఇక టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలనుకుంటోందిట. సునాయాసంగా దక్కేదేదీ మనసుకు సంతృప్తినివ్వదని చెబుతోంది. మీ వ్యక్తిగత జీవితంపై జయాపజయాల ప్రభావం ఏ మేరకు ఉంటుందని అడిగితే.. అసలు వాటిని తలకెక్కించుకొంటే కదా అంటూ ఇలా మనసువిప్పింది. ‘‘ఇతర అన్ని రంగాల్లోలానే సినిమా రంగంలోనూ జయాపజయాలు చాలా కీలకం. అయితే నేను వాటికంటే శ్రమనే ఎక్కువగా విశ్వసిస్తా. ఏ సినిమా ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. అది మన చేతుల్లోలేని విషయం కూడా. శ్రమించడం మాత్రం పక్కాగా మనకి సంబంధించిన విషయమే. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా మొదట కష్టపడటం వైపే మొగ్గు చూపుతుంటా. తొలి అడుగుల్లోనే నాకు పరాజయాలు ఎదురయ్యాయి. అప్పుడు తెలిసింది శ్రమ, విజయం విలువేంటో. అదే సునాయాసంగా విజయం దక్కుంటే ఇప్పటికీ కష్టం విలువేమిటో తెలిసేది కాదేమో. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మన కష్టమే మనల్ని నిలబెడుతుందనేది నా నమ్మకం. మనసుకు నచ్చిన ఓ పాత్ర దగ్గరకొచ్చిదంటే నటీనటులెవ్వరూ వదులుకోవడానికి ఇష్టపడరు. పరిస్థితులు సహకరించకపోయినా వాళ్లలోని నటులు ఎలాగైనా ప్రయత్నించాల్సిందే అని పోరు పెడుతుంటారు. నాకు కూడా ఇలాంటి పరీక్షలు ఎదురయ్యాయి. అయితే అంతిమంగా ఆ సంఘర్షణలో నాలోని నటి గెలుస్తుంటుంది. నా వ్యక్తిగత వ్యాపకాన్ని పక్కన పెట్టయినా వాటిని చేయడానికి సిద్ధపడతాను. వృత్తి పరంగానే కాకుండా, ప్రవృత్తి విషయంలోనూ నా ఆలోచనలు ఈ రకంగానే ఉంటాయి. నా వృత్తి, ప్రవృత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.’’ అంది రకుల్. కథానాయికల పారితోషికాల గురించి రకరకాల వార్తలొస్తుంటాయి. ఓ కథానాయిక పారితోషికం అమాంతం పెంచేసిందని, లేదంటో అవకాశాలు రాకపోవడంతో తగ్గించేసిందని ఏవేవో వినిపిస్తుంటాయి. అందులో కొన్ని నిజాలూ ఉండొచ్చు. ఎక్కువగా గాలి వార్తలూ ఉండొచ్చు. అయినా మా పారితోషికాల గురించి మీకెందుకు? అంటూ ప్రశ్నిస్తోంది రకుల్. ‘‘మేం తీసుకొనే పారితోషికం ప్రభావం సినిమాలపై ఎందుకుంటుంది? మా నటన గురించో మా క్రమశిక్షణ గురించో మాట్లాడండి. అనవసరమైన విషయాల గురించి ఎందుకు? ఓ సారి పారితోషికం పెంచామని వార్తలొస్తాయి. మరోసారి తగ్గించామని చెబుతుంటారు. నేను ఎంత తీసుకోవాలో నిర్ణయించేది నేనూ, నిర్మాతలే కదా’’ అంటోంది. ఇలాంటి పుకార్లని తానేం పట్టించుకోకపోయినా ఇంట్లో వాళ్లు కంగారు పడుతుంటారని చెబుతోంది రకుల్. ‘నా గురించి చాలా వార్తలు రాస్తుంటారు. అందులో ఒక్కటైనా నిజం అయితే బాగుణ్ణు అనిపిస్తుంది. అంతే తప్ప నేనేం సీరియస్‌గా పట్టించుకోను’ అని చెప్పుకొచ్చింది రకుల్. *