Others

వెంకీ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్ ఈమధ్యే తేజ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ఉండబోతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో నటించనుండగా ‘ఆట నాదే వేట నాదే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఇందులో ముందుగా బాలీవుడ్ నటి అతిథిరావ్ హైదరీని హీరోయిన్‌గా అనుకున్నా, ఆమె డేట్స్ కుదరకపోవడంతో శ్రీయా శరన్‌ను ఫైనల్ చేశారు. శ్రీయ, వెంకీలు గతంలో సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ హీరో నారా రోహిత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుండడం విశేషం. సురేష్‌బాబు, అనిల్ సుంకరలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.