Others

ఛాన్స్ మిస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యకాలంలో తెలుగుతెరకి పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో మెహ్రీన్ ఒకరుగా కన్పిస్తోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ వంటి సినిమాలతో ఈ సుందరి ఘన విజయాలను అందుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ముందుగా ‘తొలిప్రేమ’ కోసం మెహ్రీన్‌ను అనుకున్నారు. ఆమెను సంప్రదించారట కూడా. అయితే మెహ్రీన్ బాగా లావుగా కనిపించడంతో, ఆమెకంటే రాశీఖన్నా అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. దాంతో ఈ సినిమా ఛాన్స్ మెహ్రీన్ నుంచి రాశీఖన్నాకు వెళ్లింది. ఇంతకుముందు మెహ్రీన్ చేసిన సినిమాలు చూసినవాళ్లు... ఆమె బరువు తగ్గాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ మాటలను మెహ్రీన్ పట్టించుకోకపోవడం వలన ఈ ఛాన్స్ చేజారిపోయింది. అప్పటి నుంచి బరువు తగ్గడంపై మెహ్రీన్ దృష్టి పెట్టిందనీ.. కసరత్తు మొదలెట్టిందని అంటున్నారు.