Others

క్రేజీ గాళ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అనుకున్నదొకటి.. అయిందొకటి’ అంటూ నిట్టూర్చే వాళ్లని చిత్రసీమలో చాలా మందినే చూస్తుంటాం. అందాల తార, క్రేజీ గాళ్ రాశీఖన్నా జీవితంలో కూడా అప్పుడప్పుడు అలా జరుగుతుందట. అయితే అందరిలా మాత్రం ఆమె నిరాశ పడదట. ఎందుకంటే అలా జరిగిన ప్రతిసారీ రెండు రకాల ప్రయోజనాలు కలిగాయని చెబుతోంది. ఆ విషయం గురించి వివరిస్తూ- ‘చిన్నప్పుడు నేను గాయని కావాలని కలలు కనేదాన్ని. కానీ ఆ కల నెరవేరలేదు. ఇలా అయ్యిందేంటి? అది కొన్నిసార్లు అనిపించేది. కానీ ఊహించని రీతిలో కథానాయికనయ్యా. ఆ తర్వాత గమ్మత్తుగా నా పాట కల కూడా నెరవేరింది. బంపర్ బొనాంజా అంటే ఇదే కదా మరి! అలాగే హిందీలో తొలి సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇలా ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండాలనుకొన్నా. కానీ నేననుకున్నట్టుగా మంచి అవకాశాలు హిందీలో రాలేదు. అలాగని నేను నిట్టూర్చలేదు. నిరాశపడలేదు. ఆ వెంటనే దక్షిణాది రూపంలో నా కు దేవుడు ఓ మంచి దారి చూపించాడు. ఇక్కడ అవకాశాలే కాదు, నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటించే అవకాశాలు దొరికాయి. ఇలాంటి బంపర్ బొనాంజాలు నాకు మాత్రమే ప్రత్యేకమేమో అనిపిస్తుంది’’ అంటూ నవ్వులు చిందించిం ది రాశీఖన్నా.
*