ప్రారంభం కానున్న బిట్రగుంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జె.వి.నాయుడు ప్రధాన పాత్రలో జాలె ఫిలిమ్స్ పతాకంపై నాగరాజు తలారి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బిట్రగుంట’ (ది బిగినింగ్). మురళీధర్‌రెడ్డి, ఇషిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ జూన్ 15నుండి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో ఈ సినిమాను షూటింగ్ చేయనున్నామని, దారి దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. దొంగల ముఠాలకు, పోలీసులకు మధ్య జరిగే ఛేజింగులతో ఈ సినిమా ఉత్కంఠ భరితంగా సాగుతుందని, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాధాన్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కరుణాకర్, నిర్మాత: జాలె వాసుదేవనాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగరాజు తలారి.