Others

ధ్యానం - ఉషస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి యొక్క జీవితం ప్రధానంగా మూడు దశలు. 1.బాల్యం 2.యవ్వనం 3.వార్థక్యం. బాల్య యవ్వన దశలలో వుండేవి ‘ముచ్చట్లు’. అయితే వార్థక్యంలో వుండేవి ప్రధానంగా ఇక్కట్లు. ముచ్చట్లలో పూర్తిగా మునిగిపోతే, ఆ తర్వాత ఇక్కట్లలో పూర్తిగా కొట్టుకుపోక తప్పదు. ఎంత ముచ్చట్లలో వున్నా, వాటితోబాటు ‘ప్రజ్ఞ’ కూడా పెంచుకుంటూ పోతే జీవిత చరమ దశలో ఇక్కట్లు అనేవే ఉండవు. ‘శుభస్య శీఘ్రం’ ‘ఆలస్యం అమృతం విషం’
వార్థక్య దశ ఇంకా మీద పడనప్పుడే, మరణ సమయం ఆసన్నం కాకమునుపే బాల్యంలోనే మరి యవ్వనంలోనే ‘ప్రజ్ఞ’ను సంపాదించుకుని తీరాలి! ఏ విధంగా వస్తుంది ప్రజ్ఞ? కేవలం ‘్ధ్యనం’ ద్వారా మాత్రమే! అన్యధా శరణం నాస్తి!
వృద్ధులమయినపుడు వివేకం, వైరాగ్యం అనేవి తమంతట తాముగానే వచ్చేస్తాయి అని మూఢులు అనుకుంట వుంటారు. వార్థక్యం వస్తే శరీరం ఎలానూ శిథిలం అయిపోయి దాని మీద వ్యామోహం సహజంగానే నశించిపోతుంది - ఇక ఎందుకూ ఏ సాధనలూ అని మరికొందరు పెదవి విరుస్తూ వుంటారు. ఇదంతా ‘అజ్ఞానం’ లేదా స్మశాన వైరాగ్యం లాంటిది. ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అనేది అత్యంత సరియైన విధానం. బాల్యంలో ధ్యానం - ప్రాయంలో ధ్యానం మరి జ్ఞానం! ప్రౌఢత్వంలో ధ్యానం - జ్ఞానం - అనుభవం! వృద్ధాప్యంలో ధ్యానం - జ్ఞానం - అనుభవం - అనుభూతి. ఇలా బాల్యం నుండే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఔపోసన పట్టడం వల్ల ఏ వయసులో సాధించాల్సింది ఆ వయసులోనే సంప్రాప్తమవుతుంది.
బాల్య వయసులో ఉన్నపుడు ‘గోరంత’ ధ్యాన సాధనతో సాధ్యమయేది, వయసు మళ్లినపుడు ‘కొండంత’ ధ్యాన సాధన అవసరమవుతుంది. కనుక ఎపుడు చేయవలసినవి అపుడు చేస్తేనే, ఎపుడు రావలసినవి అపుడు వస్తాయి. ‘మొక్కై వంగితేనే మానె వంగుతుంది’. అదే ఉపస్సు. అదే మేలుకొలుపు.
ఒక పిల్లాడిని ధ్యానం చేయమని చెప్పిచెప్పి విసిగిపోయారు అతని తల్లిదండ్రులు. అతడిని ‘ఓషో’ మహాశయుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ కుర్రాడిని గూర్చి ఓషోకు ఇలా చెప్పారు. మా అబ్బాయి ఎప్పుడూ ఒకచోట నిలకడగా కూర్చోలేడు. ధ్యానం చెయ్యమంటే అటూ ఇటూ తిరిగి గంతులేస్తాడు తప్ప కూర్చోడు. ఎలాగైనా మీరు వీడిని ధ్యానానికి కూర్చునేట్లుగా చూడాలి అని వినయంగా విన్నవించుకున్నారు భగవాన్ ఓషోతో!
ఆ పిల్లాడితో ఓషో అన్నాడు. ‘నువ్వు ఈ ఇంటి చుట్టూ ఏడుసార్లు పరిగెత్తు. ‘నీకెంత శక్తి ఉందో చూపించు’ నిన్ను చాలా సోమరివి అనుకుంటున్నారు నీ తల్లిదండ్రులు అన్నారు ఓషో. ఓ! చూస్కోండి మీరే అని గట్టిగా అరిచి, పరుగెత్తి 15 నిమిషాల్లో పదిసార్లు ఇంటి చుట్టూ పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయి వచ్చి ఓషోగారి పక్కన కూర్చున్నాడు ఆ పిల్లాడు. పలకరిస్తే జవాబు చెప్పలేదు ఒగరుస్తూ.
ఒక పని చేయి. నువ్వు కళ్లు మూసుకో. ప్రశాంతంగా పదిహేను నిమిషాలు కూర్చో! నీకున్న శక్తి అమోఘం! నేను చెప్పినట్లు చేస్తే నీలోని శక్తి వందరెట్లు పెరుగుతుంది అన్నారు ఓషో ఆ కుర్రాడితో! బాగా అలసిపోయి ఉన్న ఆ బాలుడికి కళ్లు మూసుకుంటే ఎంతో హాయి అనిపించింది. రెండు నిమిషాల్లోనే తెలియకుండానే ‘్ధ్యనస్థితి’లోకి వెళ్లిపోయాడు. అంతే - అదే అలవాటుగా మారింది వాడికి. ధ్యానం ఇపుడు అతడి దినచర్యలో భాగంగా మారింది. క్రమకాలంలో అతడు ‘యుక్త వయస్కుడయే’సరికి జీవితమే ధ్యానమవుతుంది అతడికి. స్థిరత్వం ఆపై స్థితత్వం.
అక్షరం అంటే తెలియని మానవుడి నుండి ఆకాశంలో అద్భుతాలను కనుగొనే స్థాయికి వేగంగా ఆ మానవుని మేధస్సు అభివృద్ధి చెందింది. కానీ అంతే వేగంగా మానవుల మూఢాచారాలు, అజ్ఞానం కూడా ప్రబలిపోయింది. తనలోని ఆత్మశక్తిని తాను తెలుసుకోలేక బయట ఏదో అతీతమైన శక్తి ఉందని భ్రమపడి ఆ శక్తిని అందుకోవడానికి నిరంతరం తనలోని శక్తిని వృధా చేసుకుంటున్నారు. తనలోనే అంతా ఉందని మరిచి తనను తాను కించపరచుకుంటూ తన భవిష్యత్తుకు తానే బంధనాలు తగిలించుకుంటున్నాడు.
ఇదంతా ఏ ఒక్కరి వల్లనో మనం ఈనాడు అనుభవించట్లేదు. తరతరాలుగా వేళ్లూనుకున్న అజ్ఞానం పెరిగి పెద్దై మనలో జీర్ణించుకు పోయింది. వీటన్నింటినీ పట్టించుకోకుండా ఒక్కసారి ధ్యానం చేసి, ఆ ‘మజా’ ఏమిటో ఆనందిస్తే చాలు - జీవితం గాడిలో పడుతుంది. ఎటొచ్చీ, కొత్తవారికి సులభంగా అర్థమయేలా సింపుల్‌గా బోధించాలి! ఊకదంపుడు ఉపన్యాసం కాకుండా నచ్చజెప్పి కూర్చోబెట్టాలి ధ్యానంలో! -సశేషం
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరి ఓషో సందేశాల నుండి)

-మారం శివప్రసాద్