Others

నిదురమ్మా రావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక జీవితం యాంత్రికమే కాదు- ఆందోళనలమయం కూడా! అభద్రతలూ, ఆత్మన్యూనతలూ, ప్రేమ రాహిత్యాలు, భేషజాలకు పోయి స్వయంకృతంగా పెంచుకుంటున్న అప్పుల బాధలూ, వృత్తిపరంగా వెంటబెట్టే డెడ్‌లైన్లు - టార్గెట్లు- వగైరాది దైనందిన సమస్యలు నేటి ఆధునిక జీవన చిత్రాన్ని ఛిద్రం చేస్తున్న అంశాలు. సంపాదనలు పెరిగాయి- సంపదలు పెరిగాయి- కానీ కంటినిండా నిద్ర కరువై తగిన విశ్రాంతి తద్వారా చేకూరే మనశ్శాంతి మృగ్యమైపోతోంది.
ఇటీవల జరిగిన అధ్యయనాలు ఈ నిజాన్ని తేటతెల్లం చేస్తూ నలభై దాటిన వారిలో నలభై శాతం- అరవైదాటిన వారిలో ఎనభై శాతం నిద్ర లేమి సమస్యతో సతమతమవుతున్నారని నొక్కి వక్కాణించింది.
నగరాలలోనూ పట్టణాలలోనూ ఈ సమస్య మరీ అధికంగా వుందని ఘంటాపథం చెపుతూన్న అధ్యయనాలు అసత్యాలు కావన్న సంగతి మనందరికీ తెలుసు. నిద్రాహారాలు త్యాగం చేసి మరీ నిధి సేకరణలో నిమగ్నమైపోతూన్న ఆధునికుడు అసలు ‘నిద్ర’ ఒక జీవితావసరం అన్న సంగతినే ఆసాంతం మరచిపోతున్నాడు. ప్రముఖ సినీ కవి చెప్పినట్లు ‘కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది’- అప్పుడు బెదురులేని కుదురైన జీవితం మన సొంతమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. దాని పర్యవసాన జీవనక్రియలో లోపాలు- ఆ వెనుకనే అంతుబట్టని అనారోగ్య సమస్యలు- ఈ చక్రభ్రమణంలో మానవ జీవితం కంటకప్రాయమవుతోంది.
శాస్ర్తియంగా చెప్పాలంటే ప్రతి మనిషికీ రోజుకు సుమారు ఏనిమిది గంటలు నిద్ర అత్యంత అవరం. అంటే రోజు కాలమానమైన 24 గంటలలో మూడో వంతు నిద్రకు కేటాయించి తీరాలి. ఈ నిత్యావసరాన్ని నిర్లక్ష్యం చేసి ఈ పనిలేని నిదుర పనికి చేటు కదరా అని వక్రభాష్యం చేసి ఆ సమయం కూడా సద్వినియోగం చేసుకుంటే- మరో నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు అనుకుంటే ఆ నిర్లక్ష్యం ఖరీదు చెల్లించుకోవలసింది కూడా అక్షరాలా మనమే.
రోజుకు పగలూ - రేయిలా మనిషికి శ్రమా - నిద్రా సరిసమానమైనప్పుడే చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది. సమస్యలెదురైతే సమతౌల్యమైన పరిష్కార మార్గం ఆలోచనా రూపంగా సమకూరుతుంది. ఒక గంట నిద్ర- పది గంటల శ్రమకి పెట్టుబడి అవుతుందని పెద్దలు చెప్పినమాట- మన జీవన వ్యాపారానికి రాచబాట! సక్రమంగా సమయానుసారం నిద్రకుపక్రమించే అలవాటు వలన మానవ శరీరం తన తదితర బాధ్యతల్ని నిర్వర్తించుకుంటుందని శాస్తవ్రచనం. మెదడు తాజాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాల్ని స్మృతిపటలంపై నిక్షిప్తం చేసుకునేందుకు వీలు కలిగేది- ఆ నిద్రా సమయంలోనే! అలాగే జీర్ణవ్యవస్థ ఆహారాన్ని ఆరగించుకొనే పనిని రెండింతలుగా వేగపరిచేది కూడా ఆ విశ్రాంతి కాలంలోనే! నిద్రపోతున్నపుడే మన శరీరంలో ప్రొటీన్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. చర్మానికి తగిలిన గాయాలకు, మానిపోయే దిశగా వైద్యం జరిగేది కూడా ఆ విలువైన సమయంలోనే! ఇలా పలు రకాల ప్రయోజనాల్ని సంతరించుకున్న నిద్రను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకూ సమంజసం?
శరీరానికే కాదు ‘నిద్ర’ మనసుకు కూడా మందులాగానే పనిచేస్తుంది. అనేకానేక ఆలోచనలతో ఆందోళనాభరితమైన మనోవ్యాధికి గురి అవుతున్న కల్లోలిత మనసువలన ‘ఇన్సోమ్నియా’ నిద్ర పట్టకపోవడం అనే అనారోగ్యం సంభవిస్తంది. అది అలవాటుగా మారి దీర్ఘకాలిక నిద్రలేమి రుగ్మతగా పరిణమిస్తుంది. ఈ ప్రమాదాన్నుంచి బయటపడే ప్రయత్నంగా మత్తు పదార్థాలకు బానిస కావడం జరుగుతుంది. ఈ విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే నిద్ర విలువను గుర్తెరిగి ప్రవర్తించడం మన కర్తవ్యంగా భావించాలి. అది ఓ బాధ్యతగా స్వీకరించాలి.
ప్రపంచ వ్యాప్తంగా నిద్రమాత్రల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుండటం గమనార్హం. దీని విలువ సుమారు లక్షల కోట్ల పైమాటే అనే మాట అలా వుంచి, ఈ నిద్ర మాత్రల వాడకం వలన కాలేయ, మూత్రపిండ వ్యాధులు మిక్కుటమయ్యే ఇబ్బంది కూడా ఉంది. కంటి సంబంధ వ్యాధులు, కండరాల బలహీనతలూ కలుగవచ్చు. కనుక నిద్రపోవడం అనేది మన చేతుల్లో వుండే పనే కాబట్టి- దానికోసం మాత్రలు వాడడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
పగలంతా పనిచేయడం- రాత్రిపూట నిద్రపోవడం అనేది సహజసిద్ధమైన ఓ ప్రకృతి నియమం. ఆ నియమాన్ని అతిక్రమించడం కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి జరిగేది కూడా రాత్రి సమయంలోనే! అది ప్రకృతి సిద్ధమైన ఓ ఏర్పాటు కనుక- నిద్రకు తగిన సమయాన్ని కేటాయించి, ఆ నియమాన్ని పాటించడం మనందరి ఉద్యుక్త విధి! నిద్ర విలాసమో, వినోదమో కాదు- అది ఒక నిత్యావసరం. కాబట్టి రోగ నిరోధక వ్యవస్థని పునరుజ్జీవింపచేసే నిద్ర విషయంలో అలసత్వం వద్దు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను పోషక విలువల ప్రాముఖ్యత వుందో నిద్రకు కూడా అంతే ప్రాధాన్యత వుంది. నాణ్యమైన నిద్ర ఒక్కటే నాణ్యమైన జీవితానికి నాంది పలుకుతుంది

-మరువాడ భానుమూర్తి