Others

అవగాహన అవసరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం ముందుకు పోతోంది. స్ర్తీలు అన్నింటిలోను ముందుకు దూసుకెళ్తున్నా రు. కాని ఇంకా కొంతమంది నిరక్ష్య రాస్యులుగా కూడా అక్కడక్కడ కనిపిస్తునే ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాల్లాంటి మూఢా చారాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయ. వీటిని రూపుమాపాలంటే ప్రతి ప్రాంతానికి న్యాయవాదులు, లేక స్వచ్ఛంధ సంస్థలు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, చట్టాలు ఇస్తున్న రక్షణ వసతుల గురించి అక్కడి వారికి తెలియబర్చాల్సి ఉంటుంది. లేకపోతే ఇతర ప్రసార మాధ్యమాలు ప్రజలకు అవగాహన కల్పించే దిశగా తమ కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల భర్తల వల్ల అవమానాలే కాదు జీవించడానికి అనేక రకాలుగా కష్టపడేనారీమణులున్నారు. భర్తలనుంచి ఇష్టమున్నా లేకపోయనా వారిదగ్గరే కాలంగడిపేవారూన్నారు. దీనికి కారణ మేమంటే భర్తలనుంచి విడివడితే వారికి రక్షణ కరువు అవుతుందని, లేక పోతేసమాజం చిన్న చూపు చూస్తుందని అదీకాకపోతే జీవించడానికి అవసరమైన డబ్బు లేదనో చెప్తుంటారు. ఇటువంటి వారికి భర్తనుండి విడివడి తిరిగి తాము సొంతకాళ్లమీద నిలబడగలిగే వరకు లేక పూర్తిగాను నిలదొక్కుకోలేమన్న దానితోనే. కాదు ఇపుడు భర్తనుంచి మనోవర్తిని పొందవచ్చు. దీనికి చట్టనిబంధనలు న్నాయ. వాటి గురించి కొద్దిగా పరిచయం.. భార్యాభర్తల మధ్యన విభేదాలు తలెత్తినప్పుడు స్ర్తిలు ఉద్యోగులు కానప్పుడు, వారికి ఆర్థిక స్థోమత లేనప్పుడు మనోవర్తి ప్రస్తావన వస్తుంది. మన దేశంలో ఉమ్మడి సివిల్ కోడ్ లేదు. అందుకని వివిధ మతాలవారికి వివిధ రకాలుగా మనోవర్తి పొందే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ విచారణలో వున్నప్పుడు మనోవర్తి పొందే అవకాశం వుంది. అన్ని మతాల్లో దాదాపుగా ఇలాంటి నిబంధనలని ఏర్పరిచారు. వివాదాలని కొనసాగించాలంటే కూడా వారికి ఆర్థిక స్థోమత అత్యఅవసరం. ఇలాంటి పరిస్థితిని గమనించే చట్టాల్లో ఒక నిబంధనని ఏర్పరిచారు. దీనే్న తాత్కాలిక మనోవర్తి అంటారు. హిందూ వివాహ చట్ట ప్రకారం మనోవర్తి కోరవచ్చు. అదేవిధంగా హిందూ దత్తత మనోవర్తి చట్టం, 1956 ప్రకారం మనవర్తి కోరే అవకాశం వుంది. హిందూ దత్తత మనోవర్తి చట్టంలోని సె.18 ప్రకారం హిందూ మహిళ తన భర్తనుంచి మనోవర్తిని, విడిగా నివాసాన్ని కోరవచ్చు. అయితే ఆ భర్త ఏదైనా వైవాహిక నేరం చేసినప్పుడే ఇది కోరే అవకాశం వుంది.
భర్త భార్యని నిర్లక్ష్యానికి గురిచేసినపుడు ఆమె మనోవర్తిని కోరే అవకాశం వుంది. అయతే చట్టం కొన్ని నిబంధనలు పెట్టింది. వాటికి అనుగుణంగా ఉన్నప్పడు కేసు తప్పకుండా మనోవర్తిని పొందే అవకాశం స్ర్తీలకు ఉంటుంది. ఆమె చట్టబద్ధంగా అతని భార్య అని, తనని తానూ, తన పిల్లలని పోషించే స్థోమత తనకు లేదని లేదా తన సంపాదన తమని తాము పోషించుకోవడానికి సరిపోవడం లేదని, భర్త ఉద్దేశ్యపూర్వకంగా ఆమెను పోషించం లేదని ఆమె నిరూపించుకుంటే భర్తనుంచి ఆమెకు మనోవర్తి వచ్చే అవకాశం ఉంది అని చట్టం చెబుతుంది. కోర్టుకు వెళ్లేముందు అన్ని రకాలుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంతేకాక భర్తకు వచ్చే ఆదాయ మార్గాలు, అతనికి ఉన్న సిథర చరాస్తులు ఇవి అన్నీ తెలుసుకొని మనోవర్తిని అడగడానికి వెళ్లవచ్చు. హింథూ స్ర్తి తాత్కాలికంగానో లేక శాశ్వతంగానో తనకు మనోవర్తిని ఇవ్వమని అడగవచ్చు. ఇలాంటి విషయాలపట్ల కూడా స్ర్తిల అవగాహన అవసరమే

- రాజ్యలక్ష్మి