Others

ధ్యాన ప్రజ్ఞోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్లిన గౌతముడు వారు చెప్పినవన్నీ త్రికరణ శుద్ధిగా అభ్యసించాడు. ‘నేను నేర్చుకున్నవన్నీ పూర్ణత్వం ఘకాదు; అవి సరియైనవి కాదు’ అని తేల్చుకోవడానికి గౌతముడకి ఐదున్నర సంవత్సరాలు పట్టింది. చివరికి ‘ఒకానొక సాయంత్రం’ సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన శ్వాస మీదే.. ఏ కుంభకమూ లేని.. కేవలం సహజ పూరక రేచకాత్మకమైన.. తన సహజ శ్వాస/ ధార మీదే తన ధ్యాస ధారను లగ్నం చేసి ‘ఆనాపానసతి’ ధ్యాన అభ్యాసం చేశాడు!
పాళీ భాషలో - ‘ఆన’ అంటే ‘ఉచ్ఛ్వాస’
అపాన అంటే నిశ్వాస
సతి అంటే కూడుకుని ఉండడం.
మన ‘శ్వాసల్ని మనం కూడుకుని ఉండడం’ అంటే ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టడం. పశువును పశుపతిగా మార్చే అద్భుతం పాశుపతాస్త్రం ఆనాపానసతి!
గౌతముడు రావిచెట్టు కింద కూర్చుని ఈ అభ్యాసం చేస్తూ ‘దివ్యజ్ఞాన ప్రకాశం’ (ఎన్‌లైటెన్‌మెంట్) పొందాడు ఆ రాత్రి.
‘ఒకటవ జాము’లో అతని ‘మూడవ కన్ను’ ఉత్తేజితమయి తన.. జన్మపరంపరను తెలుసుకున్నాడు.
‘రెండవ జాము’లో ఆ మూడవ కన్ను ద్వారా జన్మపరంపరకు కారణం అయిన ‘కర్మ పరంపర’ సత్యాలను తెలుసుకున్నాడు.
‘మూడవ జాము’లో ఈ ప్రపంచంలో దుఃఖం అంతటా ఉంది. అది తృష్ణ వలన (దురాశ వలన) కలుగుతోంది. తృష్ణ ‘అవిద్య’ (అజ్ఞానం) వలన ఏర్పడుతోంది. ఈ అవిద్య ‘చిత్తవృత్తి నిరోధతో అంతమవుతుంది’ అని తెలుసుకున్నాడు.
‘యోగః చిత్తవృత్తి నిరోధః’ అన్నారు పతంజలి మహర్షి!
ధ్యాన యోగం వల్ల మాత్రమే చిత్తవృత్తి నిరోధం కలుగుతుంది. సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాడు తప్ప ఏ స్మరణా చేయలేదు. ఏ మంత్రమూ పఠించలేదు గౌతముడు. దివ్యజ్ఞాన ప్రకాశం పొంది తనను తాను బుద్ధుడిగా ప్రకటించుకున్నాడు.
‘గౌతమ బుద్ధుడయ్యాడు’
గౌతమ బుద్ధుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందక మునుపు అయిదున్నర సం.లు కఠోర సాధన చేసి ముడి నువ్వులు కొన్ని నెలలు, ముడి బియ్యం తిని కొన్ని నెలలు, బొత్తిగా ఆహారం కూడా తీసుకొనకుండా ఉన్నపుడు అతడి శరీరం అత్యంత దుర్బలమై స్మృతి తప్పిన చందమైంది. అతడేదైనా మహోన్నతమైంది సాధిస్తాడని అయిదేళ్లుగా అతడిని కనిపెట్టుకుని వున్న కౌండిన్యుడు మొదలైన పరివ్రాజకులైదుగురు, ఆ తదుపరి గౌతముడు భిక్ష చేసి ఆహారం తినడం చూసి - ఇన్ని సంవత్సరాలు బుద్ధప్రాప్తి కోసం సాధన చేసిన ఇతడు -ప్రస్తుతం ఆహార భోగ లంపటుడయ్యాడు. ఇతడి వద్ద ఉండడం వ్యర్థమని భావించి వెళ్లిపోయారు.
బుద్ధుడు ధ్యానసమాధిలో కూర్చుంటున్న ప్రదేశం పేరు ఊరువేలావనం. ఆ ప్రాంతంలోని సంపన్న గృహంలోని కన్య సుజాత. ఆ ప్రాంతంలో ‘దేవతా వృక్షం’గా పేరుగాంచిన ఒక మర్రిచెట్టు వద్దకు పోయి ‘ఓ వృక్ష దేవతా! నాకు యోగ్యుడైన భర్త దొరికి మొదటి సంతానం పుత్రుడు జనించినట్లయితే, నీకు ప్రతి ఏటా లక్ష ధనం వెచ్చించి తిరుణాల చేయిస్తాను. పుత్ర జననం తర్వాత నీకొక అపురూప నైవేద్యాన్ని సమర్పిస్తాను’ అని నివేదించుకుంది. ఆమె కోరిక తీరి చక్కని యోగ్యుడైన భర్త మరి తొలిచూలు పుత్ర సంతానం కలిగింది. (మిగిలిన కథ రేపు)
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం మరి ఓషో సందేశాల నుండి)

-మారం శివప్రసాద్