AADIVAVRAM - Others

భవిష్యకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపు మాణిక్యాంబ (తాడేపల్లిగూడెం)
ప్ర: శని దోషాలు పోవాలంటే - కాలసర్ప దోషాలు పోవాలంటే ఏం చేయాలి?
జ: శనీశ్వరుని ముందు నువ్వుల నూనె - ఆముదం - నెయ్యి కలిపి, తెలుపు నలుపు పసుపురంగు దారాల వత్తి వేసి దీపం వెలిగించండి. కాకులకు నల్ల నువ్వులు కలిపిన అన్నం పెట్టండి. కాలసర్ప దోషానికి దుర్గాదేవికి గాని, సుబ్రహ్మణ్యేశ్వరునికి కాని నిమ్మ పండ్లు ప్రతి మంగళవారం సమర్పించండి. శుభం జరుగుతుంది.
బండి శ్యామలమ్మ (ఖాజాగూడా)
ప్ర: స్థిరాస్తి తగాదా. కోర్టుకు వెళ్లమంటారా? రాజీ కుదురుతుందా?
జ: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం రాజీ కుదిరే అవకాశం లేదు. వివాదం మాత్రం పెరిగే అవకాశం ఉంది. సహనశాంతాలు మంచివి.
మేడూరి గోపీకృష్ణ (అద్దంకి)
ప్ర: వేపచెట్ల పెంపకం రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను. లాభసాటిగా ఉంటుందా?
జ: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీకుపయోగించేవి ప్రయాణ సంబంధమైన రంగాలు - వ్యవసాయం చేయాలనుకుంటే ఆముదము చెట్లు కొంతవరకు లాభిస్తాయి.
గాయత్రి (గార్ల, తెలంగాణ)
ప్ర: మామిడి తోట నరికి కలప అమ్మి ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. దోషమా? పరిహారమేమిటి?
జ: పువ్వులు పూసి.. కాయలు కాసి.. ఫలాలను అందించే చెట్టును నరకకూడదు. పూర్తిగా గొడ్డుచెట్లైతే ఒక ముహూర్తం చూసి నరకాలి. మంగళవారం మాత్రం ఎప్పుడూ చెట్టును నరకకూడదు. తోటను నరకాలనుకుంటే పరిహారంగా శివునికి పంచామృతాభిషేకం ఆ తోటలో చేసి - చెట్లకు పెరుగు అన్నం నివేదన చేసి మొదటిరోజు నెమ్మదిగా ఐదుసార్లు మాత్రమే గొడ్డలి ఆనించి రెండవ రోజు పూర్తిగా నరకవచ్చును. లేకపోతే వృక్ష శాపం అంటుకుంటుంది.
సుబ్బరాయశెట్టి (తిరుపతి)
ప్ర: మా తండ్రిగారి ఆస్తి కోర్టులో కేసు - బంధువులతో తగాదా - నాది మూలా నక్షత్రం. ఫలితం ఎలా ఉంటుంది?
జ: మూలా నక్షత్రానికి ఏలిననాటి శని ప్రభావం ఉంది. సహజంగానే కేతుదశ కనుక బంధువిరోధం ఉంటుంది. కోర్టులో వ్యవహారాలు తొందరగా పరిష్కారం కావు. రాజీ పద్ధతిలో వెళ్లటమే మంచిది.
జి.విజయలక్ష్మి (కర్నూలు)
ప్ర: గత సంవత్సరం డిపార్ట్‌మెంట్ సెలక్షన్ రిక్రూట్‌మెంట్‌లో ప్రమోషన్ కోసం పరీక్ష బాగా రాస్తూరాస్తూ చిరాకు కలిగి పరీక్ష చెడగొట్టుకున్నాను. నాకు ఉన్నత స్థాయి రాగలదా?
జ: ‘శ్రద్ధావాన్ లభతే విద్యా’ అని పెద్దల వాక్యం (్భగవద్గీత). ‘ది లా ఆఫ్ ఫ్రస్ట్రేషన్ పాయింట్’ అనేది ఆధునిక మనస్తతత్వ శాస్తవ్రేత్త సిద్ధాంతం. విసుగు చిరాకు కలిగిన సమయంలోనే ఇచ్ఛాశక్తితో పట్టుదలతో ప్రయత్నించాలి. అప్పుడే విజయం లభిస్తుంది. మొదట శ్రధ్ధను అభివృద్ధిపరచుకోండి.
కోగంటి ధరణి (కొత్తపేట)
ప్ర: ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
జ: దూర ప్రదేశంలో నైరుతి దిశలో మీకు మీ అర్హతలను బట్టి ఉద్యోగ యోగం ఉంది. ఆగస్టులో శుభం జరుగవచ్చు.
కె.లక్ష్మీప్రసన్న (బాలానగర్)
ప్ర: సి.ఏ ఎప్పుడు పాసవుతాను. నా నక్షత్రం చిత్తా రెండవ పాదం. కన్యారాశి.
జ: ప్రస్తుతం మీకు విద్యా స్థానంలోనే శనిదేవుడు ఉన్నాడు. విఘ్నాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి సోమవారం అటుకులూ బెల్లం - వినాయకునికి సమర్పించి పూజించాలి.
డి.మహేశ్ (కామారెడ్డి)
ప్ర: కాబోయే వధువు ఏ రంగం నుండి వస్తుంది?
జ: కళాత్మక సాంకేతిక రంగం నుండి వచ్చే అవకాశం ఉంది. వైద్య సంబంధం అనుకూలం ఏదు.
దుద్దిరాల అనిత (గగ్గుపాడు)
ప్ర: నా పుట్టిన తేదీ 10.1.1974. సమయం మధ్యాహ్నం 2.30 ని. నా గురించి జాగ్రత్తలు చెప్పండి.
జ: ఆరోగ్యరీత్యా మీకు మోకాళ్లు, హృదయ స్థానం బలహీనం. సాధ్యమైనంత వరకు ప్రశాంతతని అలవరచుకోండి. ప్రయాణాలు ఎక్కువగా చేయకండా. అన్నింటా జాగ్రత్త అవసరం.
వి.ఝాన్సీలక్ష్మి (తాడేపల్లిగూడెం)
ప్ర: దాంపత్యంలో పొరపొచ్చాలు
జ: దాంపత్యంలో ఎంతటి ఆదర్శ దంపతులకైనా కొన్ని అభిప్రాయ భేదాలు తప్పవు. సహన శాంతాలే శ్రీరామ రక్ష. వీలుంటే చారిత్రక పురుషుల జీవిత చరిత్రలు చదవండి. పరిష్కారం మీకే దొరుకుతుంది.
కె.వి.ఎస్.ఎన్.మూర్తి (నాగంపేట)
ప్ర: నేను కోల్పోయిన ప్రభుత్వోద్యోగం (టీచర్) తిరిగి రాగలదా?
జ: రికార్డు రిపోర్టులు అనుకూలంగా ఉన్నట్టు లేవు. దైవం అనుకూలించాలి.
కొత్తపల్లి రాములుగౌడ్ (మూసాపేట)
ప్ర: నేను కవల పిల్లల్లో ఒకడిని. జాతకం బాగుండాలంటే ఏం చేయాలి?
జ: అశ్వినీ దేవతలను ఆరాధించాలి.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా- ఎడిటర్, భవిష్యకాలం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినిదేవి రోడ్, సికిందరాబాద్ - 500 003.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ