AADIVAVRAM - Others

టాటా బైబై పోలియో (క్విజ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిదండ్రులూ జాగ్రత్త వహించండి.
ప్రస్తుతం భారతదేశం పోలియో వైరస్ లేని దేశంగా ప్రకటించబడింది. జనవరి 13, 2011న చివరిసారిగా ఈ వ్యాధి బారిన పడింది ఓ భారతదేశ చిన్నారి. అయితే మీ శిశువులు మరియు పిల్లలకు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మీ పిల్లల వైద్యుని సూచనల మేరకు తప్పక పోలియో చుక్కలు ఇప్పించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రోటరీ ఇంటర్నేషనల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు 22 లక్షల మంది వాలంటీర్లు మరియు కోట్ల పిల్లల తల్లిదండ్రుల సమిష్టి కృషి, సాంకేతిక మరియు కార్యాచరణ మద్దతుతో మనం పోలియో వైరస్‌ని పూర్తిగా నిర్మూలించగలిగాం. పైన పేర్కొన్న సంస్థలు, వాలంటీర్లకు ప్రతి భారతీయుడు సదా కృతజ్ఞులై ఉండాలి.
*
1.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్నీ పోలియో రహిత దేశంగా ప్రకటించి, పోలియో బాధిత దేశాల జాబితా నుంచి మన దేశాన్ని ఎప్పుడు తొలగించింది?
ఎ) 24 ఫిబ్రవరి 2012 బి) 25 ఫిబ్రవరి 2011
సి) 24 ఫిబ్రవరి 2014 డి) 25 ఫిబ్రవరి 2017
2.పోలియో విషయంలో కోల్‌కతాలోని హౌరాలో ఒక బాలిక రుక్సర్ ఖుతున్ ఏ విధంగా ప్రాముఖ్యత పొందింది?
ఎ) ఆమె పోలియో నుంచి పూర్తిగా నయమైన మొదటి మనిషి
బి) ఆమె ఆసియాలో పోలియో చివరి బాధితురాలు
సి) ఆమె భారతదేశంలో పోలియో సోకిన మొదటి బాధితురాలు
డి) ఆమె భారతదేశంలో పోలియో వైరస్ సోకిన చివరి బాధితురాలు
3.పోలియో వైరస్‌లో మూడు రకాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో చిన్నారులను ఏ రకం వైరస్ ఇంకా కబళిస్తోంది?
ఎ) టైప్ 2 పోలియో వైరస్ 1999లో నిర్మూలించబడింది మరియు టైప్ 3 పోలియో వైరస్ కేసులు 2012 నుండి ప్రపంచంలో ఎక్కడా కనపడలేదు. టైప్ 1 పోలియో వైరస్ ఇప్పటికీ కొన్ని దేశాలలో ఉంది
బి) టైప్ 1 పోలియో వైరస్ 1988లో మరియు 2011లో టైప్ 2 నిర్మూలించబడింది. టైప్ 3 పోలియో వైరస్ ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉనికిలో ఉంది
సి) టైప్ 2 పోలియో వైరస్ 2012లో మరియు టైప్ 1 కేసులు 1999 నుండి ప్రపంచంలో ఎక్కడా కనపడలేదు. టైప్ 3 పోలియో వైరస్ ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉనికిలో ఉంది
డి) టైప్ 1 పోలియో వైరస్ 1988లో నిర్మూలించబడింది. మరియు టైప్ 2 మరియు 3 పోలియో వైరస్ ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉనికిలో ఉన్నాయి
4.మానవ శరీరానికి వెలుపల ఏ రకం పోలియో వైరస్ దీర్ఘకాలం జీవించగలదు?
ఎ) టైప్ 1 మరియు టైప్ 3
బి) టైప్ 1 మరియు టైప్ 2
సి) టైప్ 1 డి) ఏవీ జీవించలేవు
5.్భరతదేశం మరియు నైజీరియా పోలియో రహిత దేశాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క జాబితా ప్రకారం, నేటికీ పోలియో వైరస్ ఉన్న దేశాలు ఏవి?
ఎ) ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, గబాన్, సుడాన్
బి) ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, గబాన్, నైగర్
సి) ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్
డి) ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఈజిప్ట్
6.పోలియో వ్యాధి 3 రకాలుగా సోకుతుంది. అవి ఏవి మరియు ఎలా ప్రభావితం చేస్తాయి?
ఎ) నాన్ పెరాల్టిక్ ఊపిరితిత్తుల, మెదడు కండరాలు బలహీనం చేస్తుంది. స్పైనల్ పెరాల్టిక్ నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. బల్బార్ ఏమీ ప్రభావం చూపదు
బి) నాన్ పెరాల్టిక్ పక్షవాతం కలుగజేయదు. స్పైనల్ పెరాల్టిక్ నాడీ వ్యవస్థ మీద మరియు బల్బార్ మెదడు కండరాలను దెబ్బతీస్తాయి
సి) నాన్ పెరాల్టిక్ పక్షవాతంకి దారి తీయదు. స్పైనల్ పెరాల్టిక్ అవయవాల పక్షవాతానికి దారి తీస్తుంది. బుల్బర్ అనేది కండరాలు బలహీనత మరియు ఊపిరితిత్తుల కండరాలుపై ప్రభావం చేసే శ్వాస సమస్యలు కలుగజేస్తుంది.
డి) పైవన్నీ
7.ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి పోలియో ఎలా వ్యాపించింది?
ఎ) వ్యాధి సోకిన వారి లాలాజలం లేదా మలంతో కలుషితమైన చేతులతో ఇతరులకు వ్యాపిస్తుంది
బి) పోలియో వైరస్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్షంగా లేదా మాట్లాడేటప్పుడు, దగ్గు, లేదా తుమ్ములతో గాలి ద్వారా నేరుగా వ్యాపిస్తుంది
సి) పోలియో సోకిన వారి లాలాజలం, మలంతో కలుషితమైన ఆహారం, నీరు లేదా చేతుల్లో కూడా వ్యాపిస్తుంది.
డి) పైవన్నీ
8.ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ, పోలియోని నిర్మూలన, కూకటివేళ్లతో పీకి పారదోలడానికి వివిధ దేశాల ఆరోగ్య శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతుతో, గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమం (జిపిఇఐ) ఎపుడు ప్రారంభించింది?
ఎ) 1988 బి) 1981
సి) 1998 డి) 1971
9.2012లో పోలియో వైరస్ ఉన్న జాబితా నుంచి భారతదేశం తొలగించబడినప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థచే సౌత్ ఈస్ట్ ఆసియా రీజన్‌లో పది దేశాలతోపాటు భారతదేశం ఎప్పుడు అధికారికంగా పోలియో విముక్త దేశంగా ధ్రువీకరించబడింది?
ఎ) ఫిబ్రవరి 25, 2014 బి) మార్చి 27, 2014
సి) ఫిబ్రవరి 24, 2013 డి) మార్చి 1, 2015
10.పోలియో సోకకుండా చర్యలు తీసుకోడానికి రెండు రకాల పద్ధతులున్నాయి. నోటి ద్వారా పోలియో చుక్కలు ఓరల్ పోలియో వాక్సైన్ (ఓపివి) మరియు నిష్క్రియాత్మక పోలియో టీకా ఇంజక్షన్ (ఐపివి). మొదటి పోలియో వాక్సిన్‌ను (ఐపివి) ఎవరు కనుగొన్నారు? ఏ సంవత్సరంలో ఉపయోగంలోకొచ్చింది?
ఎ) ఫిలిప్ డ్రింకర్, 1952లో
బి) లూరుూస్ అగాసిజ్ షా, 1950లో
సి) జోనస్ సాల్క్, 1955లో
డి) జాకబ్ హైన్, 1955లో
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి 2.డి 3.సి 4.సి 5.ఎ 6.బి 7.డి
8.బి 9.ఎ 10.బి 11.ఎ 12.డి
*

ఆంధ్రభూమి పాఠకుల కోసం వారం వారం అందించే క్విజ్ ఇది. ఈ వారం ప్రశ్నలకు వచ్చే శనివారం (3వ తేదీ)లోగా సరైన సమాధానాలు రాసి పంపిన వారి పేర్లను ప్రచురిస్తాం.
అడ్రస్
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్ - 500 003
సమాధానాలు
sundaymag@andhrabhoomi.net కు
pdf లోనూ పంపొచ్చు.

-సునీల్ ధవళ 9741747700