Others

కృతయుగంలో మనిషి ఆయుర్దాయం ఎంత ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మనిషి ఆయుర్దాయం 100 సం.లు అయితే కృతయుగంలో 1000 సం. ఎలా బ్రతికారు?
- సి.వాసుదేవరావు, శ్రీకాకుళం
‘‘శతమానం భవతి పురు షః’’అనే మంత్రంలో శత శబ్దానికి అర్థం దీర్ఘాయువు అని మాత్రమే పెద్దలు చెపుతున్నారు. ఇక కృతయుగంలో సామాన్యాయుర్దాయం 400 అనీ, త్రేతాయుగంలో 300 అనీ, ద్వాపర యుగంలో 200 అని కలిలో 100 అనీ పురాణాలలో అనేకచోట్ల ప్రసక్తి వుంది. ఇదిగాక పూర్వయుగాలలో యోగబలంగల వ్యక్తులు చాలామంది వుండేవారు గనుక, వారిలో కొందరు తమ యోగ బలంతో వేలకువేల సంవత్సరాలు జీవించారని పురాణవేత్తలు వివరిస్తున్నారు.
* అన్ని దైవ నామాలముందు ఓం అని చేర్చి జపించవచ్చునా?
- కె.వి.ప్రసాదరావు, కందుకూరు
కొంచెం నియమనిష్ఠలు పాటించే వీలు వుంటే అలాగే జపించవచ్చు. ఆ వీలులేని వేళలో కేవలం దైవ నామ జపం నిరంతరంగా చేయవచ్చు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్ - 500 035. vedakavi@serveveda.org