AADIVAVRAM - Others

విదేశీ అతిథులు వచ్చేశాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరతీరాల నుండి ఏటా క్రమం తప్పకుండా వచ్చే విదేశీ అతిథులు ఈసారి కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఎక్కడో సైబీరియా దేశం నుండి వేల మైళ్ల దూరాన్ని గగన మార్గంలో ప్రయాణించి తుంగతుర్తి మండలానికి వచ్చే విదేశీ పక్షులను చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు.
సైబీరియన్ పక్షుల సందడి తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం, పస్తాల గ్రామాల్లో అప్పుడే మొదలైంది. ఆరు మాసాలు ఇక్కడే ఉండి ఈ పక్షులు సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సొంత దేశానికి తరలిపోతాయి. రెండు నుండి నాలుగు అడుగుల ఎత్తులో వెడల్పాటి రెక్కలు, అడుగున్నర పొడవు ముక్కు కలిగి ఉన్న ఈ వింత పక్షులను చూడటానికి వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. కాగా, పర్యాటకులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని గతంలో జిల్లా అధికారులు ఇచ్చిన హామీలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.
వేటాడనివ్వరు.. తాకనివ్వరు..
కొత్తగూడెం, పస్తాల గ్రామ ప్రజల మధ్యనే తాము జీవిస్తున్నట్లుగా సైబీరియన్ కొంగలు వ్యవహరిస్తాయి. పిల్లకొంగలైతే ఎగరలేక చెట్ల కిందనే సంచరిస్తాయి. ఆ సమయంలో వీధికుక్కలు, పిల్లులు ఇతర జంతువులు ఈ విదేశీ పక్షుల వద్దకు వెళ్లకుండా స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరైనా వీటిని వేటాడే ప్రయత్నం చేస్తే గ్రామస్దులు అడ్డుకుంటారు. గతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఈ పక్షులను వేటాడే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు.
సైబీరియా అతి శీతల దేశం. అక్కడ ఈ కొంగలకు ఎదుగుదల ఉండదు. అందుకే ఇవి దేశదేశాలు దాటి ఏటా డిసెంబర్-్ఫబ్రవరి మధ్య ఇక్కడికొస్తాయి. ముందుగా వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో కొంగల జంటలు ఇక్కడికొచ్చి తమకు అనుకూల వాతావరణం ఉన్నట్లుగా భావిస్తే వెంటనే మిగతా పక్షులను రప్పిస్తాయి. గత 30 ఏళ్లుగా ఇవి కొత్తగూడెం, పస్తాల గ్రామాల్లో ప్రజల ఇండ్ల మధ్యనే చింత, వేప చెట్లపై నివాసాలు ఏర్పర్చుకుంటాయి. డిసెంబర్ నెలాఖరుకు ఈ ప్రాంతానికి చేరుకునే ఈ పక్షులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో
అడుగుపెట్టాయి. వర్షాలు పడే సమయంలో ఇవి తిరిగి తమ దేశానికి తిరుగుముఖం పడతాయి. గ్రామానికి 20 నుండి 30కి.మీ దూరంలో ఇవి ఆహార అనే్వషణ చేస్తాయి. ఇవి తాము పెట్టే గుడ్లను, పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఆహారానికి వెళ్లినప్పుడు ఆడ లేదా మగ పక్షుల్లో ఏదో ఒకటి గుడ్లకు, పిల్లలకు కాపలా ఉంటాయి. 3 నుండి 4కిలోల బరువుండే చేపను ఇవి సులువుగా నోట్లోపెట్టుకొని రావడం విశేషం. ముఖ్యంగా వీటి దేహనిర్మాణాన్ని పరిశీలిస్తే మగ, ఆడ పక్షులు ఒకే రకంగా ఉంటాయి. మెడ నుండి ముక్కు వరకు పసుపుపచ్చ రంగుని కలిగి ఉంటాయి. మెడ వంపు తిరిగి రెండు రెక్కల నడుమ కడుపు భాగాన నలుపురంగులో ఇవి చూడముచ్చటగా ఉంటాయి.

-ఎస్.సూర్యప్రకాశ్