Others

మధురమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్‌ను అన్నీ మధుర జ్ఞాపకాలే చుట్టు ముడుతున్నాయట. బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినప్పటి నుంచి ఈ భామ అన్నీ రూమర్స్‌నే ఎదుర్కొంటోంది. అయినా ఇవేవీ తను పట్టించుకోలేదు కాబట్టే కెరీర్‌లో అగ్ర తారగా వెలుగులు విరజిమ్ముతోంది. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో సల్మాన్‌ఖాన్, కత్రీనాకైఫ్‌లపై వచ్చినన్ని రూమర్స్ మరే తారపై రాలేదంటే ఆశ్చర్యం లేదు. చాలా కాలం తర్వాత ఈ జంట నటించిన చిత్రం ‘టైగర్ జిందాహై’. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ జోడీకున్న క్రేజ్ దృష్ట్యా విశేషమైన బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. దాదాపు మూడు వందల కోట్లకు పైనే వసూళ్లు రాబట్టిందని విశే్లషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఈ చిత్రం తనకు అనేక మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని కత్రీనాకైఫ్ చెప్పుకొచ్చింది. ఎంతో నాణ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దానికి తగ్గ ఫలితాన్ని కూడా రుచిచూశారు. ఇది తనకు ఎంతో ఆనందదాయకం అని కత్రీనా ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. సల్మాన్, కత్రీనా ప్రేమలో ఉన్నారని గతంలో తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట కొన్ని కారణాల వల్ల విడిపోయినట్లు బాలీవుడ్ టాక్. అయితే ఇవేమీ వారి దృష్టిలో ఇప్పుడు లేవు. ఇక ముందు కూడా వీరిద్దరూ కలిసి మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు కూడా తాజాగా ప్రచారం జరుగుతోంది. చూద్దాం.. ఈ వార్తల్లో నిజమెంతుందో..!