Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

24.సుందరులతి తేజస్వులు సుగుణవంతు
లన్నదమ్ములు తనవెంట రాగ వౌని
సరయు తీరము జేరి వాత్సల్య పూర్ణు
డౌచు రాకొమరులజూచి రాచ తపసి

25.శ్రమమున్ క్షుత్పిపాసల నాశకములు
బల అతిబల విద్యలు శుభప్రదము లంచు
రామునకుపదేశించె ముని ప్రభుండు
రాముజేరి రాణించు నావిద్యలనుచు

26.వౌని యాదేశమున రామచంద్రమూర్తి
తాటక నొక శరమ్మున దూలనేసె
రామచంద్రుని కౌగిట జేర్చి వౌని
పులకింతుడయ్యె తన మహద్నాగ్యమునకు

27.ముని యొసంగె రామునకు దివ్యాస్తమ్రులను
యాగదీక్షితుడయ్యె సిద్ధాశ్రమమున
అంత మారీచు దోలి సుబాహు జంపి
యాగరక్షణ జేసిరా దాశరధులు

28. యజ్ఞము జూడ వచ్చిన యోగివరులు
దాశరధులను బొగిడి దీవించి జనిరి
గాధిపుత్రుడు జరిపింపదలచె రామ
భద్రు కళ్యాణమును తదనంతరమ్ము

29.రామచంద్రుని పదధూళిచే నహల్య
శాపముక్తయై రాముని ప్రస్తుతించె
గౌతముండొచ్చి పత్నిని స్వీకరించి
కౌశికుని రఘవరుల నర్చించె భక్తి

30 జనకు నాహ్వానమున గాధి నందనుండు
మిధలకుం జనె రామ లక్ష్మణుల తోడ
జనకు సభలోన త్రిపురారి ధనువు విరిచె
రామచంద్రుడు ముని పర్యవేక్షణమున

31.సిగ్గుతోడుత జానకి శిరము వంచి
రామ విభు గళమున వరమాల వేసె
సిరియనుచు జూచె సీతను రఘువరుండు
చిరునగవు చిందు మోమున శ్రీకరుండు

32.ముందు జనకుడు శుభవార్త దశరధునకు
నందజేయగ భటుల నయోధ్య కంపె
రాజ బంధువులేగాదు ప్రజలు గూడ
పొంగిరా శుభ వర్తమానమును వినుచు

33.కులగురుని యనుమతితోడ గదలె రాజు
సుతులతోడను హితులతో జ్యేష్ఠపుత్రు
ని, పరిణయమునకు మిథిలాధిపుని నగర
మునకు గములు గట్టి పరివారములు రాగ

34.పెండ్లికొమరుడై రత్నాల మండపమున
మోహనమ్ముగ వేంచేసి ముదముగొల్పు
రామచంద్రుని సీతాలలామ జూచి
మొలక నవ్వు చింతామణు లొలకబోసె

35.్ధర్మమూర్తి యా దశరధు కూర్మి పట్టి
సుగుణ రాశిని సీతను జేకొనంగ
దేవకాంతలు జల్లిరి తోయజములు
సాగరము పొంగె ధారుణి సొబగు మీరె

టంగుటూరి మహాలక్ష్మి