Others

పద్మావతి అమ్మవారి ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరులోని పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో వున్న ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై ఐదంతస్తుల శిల్పకళా శోభితమైన గోపురం నిర్మింపబడి వుంది. రంగమండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయాలు వున్న ప్రధాన ఆలయ రంగమండపంలోని స్తంభాలు అద్భుతమైన శిల్పకళా సంపదతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీపద్మావతీ అమ్మవారు పద్మాసన స్థితిలో చతుర్భుజిగా రెండు చేతులలో పద్మములను, మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలను ధరించి దివ్య మంగళ స్వరూపంతో దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్నవారికి ఇహపరసుఖాలు లభ్యమవుతాయ.