Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

36.రాఘవేంద్రుడు సీతను బెండ్లియాడె
భరత లక్ష్మణ శతృఘు్నలకు నొసంగె
తమ్ముని తనయల ముపుర ముదముతోడ
నాత్మ దారలుగ జనక చక్రవర్తి

37.నల్వుర కళ్యాణ మతివైభవముగ జరిగె
ధర్మపత్నులతో దాశరధులు మ్రొక్క
కీర్తిగాంచుడి ధర్మరక్షంము జేసి
యనుచు దీవించి కౌశికుండరిగె గిరికి

38.సీత తోడుత శ్రీరామచంద్రమూర్తి
వధుసహితులైన తమ్ములు వెంటరాగ
మార్గమున జామదగ్న్ను గర్వమణచి
సపరివారుడైసాకేత పురిని జేరె

39.పట్టమహిషులు సౌధపు ద్వారమందు
నిలచి దంపతులకు హారతుల నొసంగి
లోనికిం గొని చని వశిష్టుందు జెప్పు
విధిగ జేయించ్రి విద్యుక్త వేడుకలను

40.నాల్గు రూపులు ధరియించి లక్ష్మి ఇంట
తిరుగుతున్నట్లు దలపోసి తోయజాక్షి
నల్వుర క్రొత్త కోడండ్ల నింపు మెరయ
జూచుకొనుచుండె కౌసల్య సుగుణభరిత

41.జానకీరాముల అనురాగమ్ము ధరణి
జనులకెల్ల నాదర్శమై వినుతి గాంచె
దాశరధులును తమ తమ ధర్మపత్ను
లందు పొందుచుండిరి తరగని సుఖమ్ము

42. దేవ సముడంచు రాముని సేవకులను
సకల సద్గుణ సంపన్నుడనుచు జనులు
బొగడు చుండగ నట్టి పుత్రకుని జూచి
హృదయ ముప్పొంగ పులకితుడయ్యె రాజు

43.పెండ్లికొచ్చిన భరతుని మేనమా
దశరథుని తోడ మహారాజు! నేను వచ్చి
చాల కాలమయ్యె భరతు నందబోయె
దమిక మారాజ్యమునకని యడుగ రాజు

44.కమల దళనేత్రి కైకేయి కన్నకొడుకు
రామచంద్రుని కనుగు తమ్ముడు సుభాషి
తనకు గారాబు తనయుడౌ భరతు నంపె
మేనమామతో శతృఘు్న తోడు జేసి

45.రామ లక్ష్మణులతి భక్తి తోడ తల్లి
దండ్రులకు సేవ జేయుచు ప్రజల యోగ
క్షేమముల విచారింపుచు మెలగుచుండ
దేవసములంచు దలచిరి యెల్ల జనులు
*

టంగుటూరి మహాలక్ష్మి