Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

59. గంగ దాటగ వచ్చిన కౌసలేయు
దైవమని యెంచి గుహుడు పాదములు గడిగి
భక్తి పరవశుడై మ్రొక్కి పడవలోన
భ్రాత సీతల తోడ దాటించె నదిని

60. వసుధ పుత్రిక గంగాభవాని కెంతొ
భక్తితో మ్రొక్కి తల్లి మావిపిన వాస
మును జయప్రదముగ నెరవేర్చి వచ్చు
నట్లు మమ్ముల దీవించు మమ్మ! విరజ

61. దోష రహితుడు నాభర్త సహనశీలి
ధర్మ విగ్రహుడు కళంకరహితుడమ్మ
నాతొ తమ్మునితొ తిరిగి వచ్చి నీకు
బలులు నర్పించు నని గంగను స్తుతించె

62. అంత వారు భరద్వాజు నాశ్రమంబు
జేరి తమరాక దెల్పినమస్కరింప
సంతసంబున ముని వారి సత్కరించె
ముని యనుజ్ఞనేగిరి చిత్రకూటమునకు

63. భార హృదయము తోడ సుమంత్రు డపుడు
రాము నాజ్ఞ నయోధ్యకు జేరి పతికి
విన్నవించె రామాదులు గంగ దాటి
యేగిరము వార్త విని రాజు యేగ దివికి

64. రాము డడవికి జన మహారాజు దివిజ
ధామమున జేరుట గురు వశిష్టు డరసి
ధరయరాజక మైనచో హద్దుమీరి
జనులు బెనగెద రొకరికి నొకరటంచు

65. మేనమామ యింట గిరివ్రజపుర మందు
నున్న భరత శతృఘు్నల శీఘ్ర గతిని
బిల్చుకొనిరాగ భటులను బంపె వారు
వచ్చి కళదప్పి యున్న నయోధ్య గాంచి

66. నగరవీధుల జనుచుండ నగరవాసు
లనుకొనెడు మాట లాలించి ఖిన్నులైరి
రాజభవనము జేరి శూన్యముగ నున్న
సౌధమును జూసి విచలిత చిత్తులైరి

67. తల్లి మతిలేక జేసినతప్పిదముకు
ఘనులు రామాదు లడవికి జనగ తండ్రి
దుఃఖ భారము సహియింప లేక దివిజ
ధామము జేరుటకు భరతుండు వగచి

68. యింత దుష్టపు కార్యము జేసినట్టి
తల్లి ముఖమును జూడ నొల్లక భరతుడు
శోకరోషములతో కులపాంసురాల
తల్లి వని జెప్ప వెరచెద దుష్టురాల

69. అనుచు తల్లిని నిందించి భరతు డరిగె
పెద్ద తల్లి కౌసల్య మందిరము జేర
శోక దేవత వలెనున్న రామ జనని
పాదముల వ్రాలె శతృఘు్న తోడ నతడు

70. వారలం జూచి కౌసల్య భరతు తోడ
నాయనా నీకు మీ తల్లి యెదురు లేని
రాజ్యమును సమ కూర్చిన దేలుకొనుము
నాకొడుకు రాము నడవులపాలు చేసి

71. ఆమె బల్కిన నిష్టుర వాక్యములకు
భరతు హృదయము సూదుల గ్రుచ్చినట్లు
బాధ గలుగగ తల్లి! నేనెరుగ నమ్మ!
ఈ విషయము లేవియు నమ్ము మనచు నెడ్చె

టంగుటూరి మహాలక్ష్మి