Others

మానవత్వమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను దర్శించమని తత్వమసి సిద్ధాంతాన్ని తెలియజెప్పారు. శిరిడీ సాయ, స్వామి అయ్యప్ప వీరు ఇద్దరూ బ్రహ్మచారులు. ఇద్దరూ కలియుగ వరదులు, ఆపద్బాంధవులు, ఆశ్రీత రక్షకులు అవడంవలన ‘ఓం సాయి శ్రీసాయి షిర్డీసాయి’, ‘ఓం స్వామియే శరణమయ్యప్ప’ అని భక్తులు కీర్తిస్తున్నారు. షిర్డీసాయిని పెంచిన తల్లిదండ్రులు బాబా బాలునిగా వున్నప్పుడే మరణించడంతో బాబా అనాధగా పెరిగి పదహారేళ్ల వయసులో మొదటిసారి షిర్డీ వచ్చి ఖండోబా మందిర పూజారి మహల్సపతి తొలిసారి శ్రీ సాయిని దర్శించగానే ‘ఆవోసాయి’ అనడంతో బాబాగారికి సాయినామం స్థిరమ్ఘైంది. పందళంలో పెరుగుతున్న మణికంఠుని ప్రజలు, రాజు, రాణి అంతా అయ్యా, అప్పా అని సంబోధించి పిలవడంతో స్వామివారి నామం చివరకు ‘అయ్యప్ప’గా స్థిరపడింది. అయ్యప్ప హరిహర సుతుడైతే, సాయిబాబా దత్తావతారంగా చెబుతారు. ఇద్దరూ ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన సత్పురుషులే.