Others

ఫ్యానే్స నిజమైన హీరోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలు.. పండ్లు.. పువ్వులు సినిమాలో హీరోయిన్ కోసం, అవసరమైతే సినిమా హాలు బయట హీరోగారి పూజకోసం అవసరం. ‘అభిమాని లేనిదే హీరోలు లేరులే!’ అన్న గీత రచయిత భావం అక్షరసత్యం. ఇదేమి బంధమో తెలియదుకానీ సినిమాకు మాత్రం వీరే బలం. కలెక్షన్ల వాటాలో వీరిదే అగ్రతాంబూలం. ఒకప్పుడు అభిమానులకు దూరంగా ఏ సినిమా ఫంక్షనైనా జరిగేది. ఇప్పుడు అభిమానుల సమక్షంలోనే జరుగుతోంది. పైగా వంశాభిమానులుగా అభిమానులు తమ హీరోల నోట కొనియాడబడటం విశేషం!
ఆడియో విడుదలంటే అభిమానులకు ముందొచ్చే పండుగ. అందుకే ఈ పండుగలో రాబోయే సినిమా డైలాగ్‌ని తమ హీరో నోటివెంట వినాలని తెగ కేరింతలు కొడతారు. అందుకోసం ఆతృతగా ఎదురుచూస్తారు. అంతకుముందు ఎవరెన్ని చెప్పినా పెడచెవిని పెడతారు. వారి కేరింతలకు కంట్రోల్ బ్రేక్ హీరో మాటే! ఒక్కోసారి ఈ కేరింతలు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గానికి అసహనం కలిగేలా చేస్తాయి. ఫైర్ అయ్యేలా కూడా చేస్తాయి. అయినా కూడా అభిమానులు కోపగించుకోరు, చిరునవ్వుతో కొట్టేస్తారు. మా అభిమాన హీరోకి సంబంధించినవారే కదా అని లైట్ తీసుకుంటారు. అందుకే అభిమానులపట్ల హీరోలు బాధ్యతగా వ్యవహరిస్తారు. అవసరమైనంత మేరకు భజన చేస్తారు. ఈ విషయంలో ఎవరూ అతీతులు కారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం ఆవేశంగా చేసేస్తారు. ఎందుకంటే అభిమానం లేకపోతే సగం వాటా దెబ్బతిన్నట్టే! అభిమానుల కోసం ప్రత్యేకమైన ఫీట్స్ చేసి సినిమాల్లో మెప్పిస్తూ వుంటారు. అభిమానులు వేసే పూలమాలలకు తలొంచుతారు. ప్రతి సినిమాను మీకోసమే.. అంటూ ఉర్రూతలూగిస్తారు. తీరా సినిమా విజయం తలక్రిందులైతే అభిమానులే కాదు హీరోలూ డీలాపడతారు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా అభిమానులు చెక్కుచెదిరిపోరు. మరో సినిమా కోసం ఎదురచూస్తూ వుంటారు. మరి ఇలాంటి అభిమానులు చేసే అత్యుత్సాహ కార్యక్రమాలకు బ్రేక్ వేయడానికి కోర్టులో ప్రజావ్యాజ్యం వేసాడో తమిళ పౌరుడు. దీంతో కోర్టు సైంతం సదరు హీరోలను ఆలోచించమని చెప్పడంతో అభిమానులు కొంత డైలమాలో పడ్డారు. దీనిలో నిజం వున్నా అభిమానాన్ని ఎవరూ ఆపలేరు అంటారు అభిమానులు. అభిమాన హీరో సినిమా విడుదలంటే అభిమానులకు ఓ పండగ. అందుకే క్షీరాభిషేకంతో కటౌట్లను తడిపేస్తారు. పండ్లు పంచి ఆనందాన్ని వ్యక్తీకరిస్తారు. హీరో ఎంట్రీ వస్తే చాలు థియేటర్ అంతా పూలవర్షమే పడుతుంది. సినిమా విడుదల రోజు బాణాసంచాతో ప్రాంగణం దద్దరిల్లిపోతుంది. టికెట్ల పోరులో గేట్లు సైతం విరిగిపోతాయి. ఇలా పెచ్చరిల్లిన అభిమానం మాటున ఎందరో అభిమాన హీరోల కోసం ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ విషయంలో స్పందించి ఎన్ని లక్షలు సాయం అందించినా అభిమాని కుటుంబం కోలుకోలేదనేది వాస్తవం. అయినా అభిమానం తరిగిపోదు. అభిమానులు ఆగిపోరు. అందుకే హీరోలకు హీరోయిజమ్‌పైనే నమ్మకం.
ఒక్కరోజు.. ఒక్క ఆటకు జరిగే ఈ హద్దులేని అభిమానం వల్ల పౌష్టికాహారం కోసం ఎదురుచూసే ఎందరో పిల్లలకు ఉపయోగపడే పాలు కటౌట్లను తడిపేందుకే నేలపాలవుతున్నాయ. ఇది ఎంతవరకు సమంజసం? బాణాసంచాతో సౌండ్ పొల్యూషన్ చేయడం ఎంతవరకు సమర్థనీయం? ఈ విషయంలో హీరోలు ఆలోచించాలి. అభిమానులను సరైన పంథాలో నడిపించాలి? ఇప్పటికే చాలా అభిమాన సంఘాలు సమాజ సేవకోసం పనిచేస్తున్నాయి. కటౌట్ల పాలాభిషేకం విషయంలో కూడా హీరోలు స్పందించి ఆ పాలను నేలపాలు కాకుండా ఆ రోజు ఏదోక ఆస్పత్రిలో పంచే విధంగా చేయగలిగితే ఇంకా అభిమానుల సంఖ్య పెరిగే అవకాశం వుండొచ్చు. తెలుగునాట కంటే తమిళనాట ఈ అభిమాన పాలాభిషేకాలు చాలా ఎక్కువ. అందుకే ఈ విధమైన కేసు కోర్టులో ఫైలు కాబడింది. వివిధ ఫంక్షన్లకు అటెండ్ అయ్యే అభిమానులకు ‘మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి’ అని సూచించే హీరోలు.. విడుదల రోజు జరిగే ఈ కేరింతలకు కూడా బ్రేక్ వేయాలి. హీరోల పుట్టినరోజునాడు నిర్వహించే బ్లడ్‌బ్యాంక్, బీదలకు పండ్లు, పాలు, వస్త్రాలు పంచడం వంటి కార్యక్రమాల్లాగా సినిమా విడుదల నాడూ సమాజహిత కార్యక్రమాలు చేపట్టమని చెప్పడం మంచిదే కదా! సినిమా విడుదల రోజు థియేటర్ డెకరేషన్ చేసినా మిగతా హడావుడికి బదులు సమాజంలో ఏదో ఒక మంచి పనిని చేస్తే ఆ ప్రభావంతో సమాజం అభివృద్ధి కొంతైనా జరుగుతుందని అభిమానులకు హీరోలు చెప్పాలి. తొలి టికెట్‌ను ఎంతైనా పెట్టి కొని.. తొలి ప్రేక్షకులుగా.. తొలి చప్పట్లు కొట్టే అభిమానులు హీరోలుగా మారాలంటే తమ హీరోలపై వున్న అభిమానాన్ని సమాజంపై చూపడమే సరైన నిర్ణయమని భావించాలి. అలా జరిగిన నాడు ప్రతి అభిమాని ఓ హీరోనే!

-బాసు