Others

సుమధుర రామాయణం.. (బాలకాండం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

72. భరతు కౌసల్య నిర్దోషిగ గ్రహించి
అక్కునం జేర్చుకొని పుత్ర! నిన్ను నేను
శోకమోహితనై యనకూడనట్టి
మాటలంటిని వూరడిల్లుము కుమార

73. గురు వశిష్టుడు శోక సంతప్తుడైన
భరత నోదార్చి మహరాజు కాయమునకు
అగ్ని సంస్కారములను జేయించి నీవు
రాజ్య పాలన జేపట్ట వలయు ననగ

74. వెరచి యపకీర్తి కాధర్మపరుడు బల్కె
రామచంద్రుడే కోసల ప్రజలకెల్ల
సార్వభౌముడు నేనన్న సేవకుడను
వనమునకు జని రాముని దోడి దెత్తు

75. ధర్మ యుతములు భరతు సంభాషణముల
సంతసించిరి మంత్రి సామంతులంత
గురుజనంబులు తల్లులు తరలిరాగ
నేగె భరతుడు దోతేర రామభద్రు

76. గుహుని గలసిరి శృంగి బేరంబు నందు
భరతు మదినెరిగి గుహుడత్యాదరమున
ఐదు వందల పడవ లాయత్త పరచి
సకల పరివారములతొ దాటించె గంగ

77. మార్గమున భరద్వాజాశ్రమంబు జేరి
వౌనివరునకు ప్రణమిల్లి యా మహాత్ము
దీవెనల తోడ దివ్యవౌ విందు గుడిచి
విశ్రమించిరి జనులతో యునుడు గృంక

78. వేకువనె లేచి భరత శతృఘు్న లెంతో
భక్తితో ముని వర్యుని పాదములకు
వందనములిడి వౌని యనుజ్ఞ వడసి
యేగిరందరు రామ దర్శనము జేయ

79. దండ కారణ్యమున చిత్ర కూటమందు
గనిరి జానకీ సౌమిత్రిసహితు రాము
హర్ష శోకము ల్పెనగొన అన్న పాద
ములను వ్రాలిరి భరత శతృఘు్న లపుడు

80. తమ్ములిద్దరి రాముడాదరము మీర
పెద్ద తడవు మేను నిమిరి ప్రేమ తోడ
గాఢముగ వారి నాలింగనమ్మొనర్చి
హృదయమున జేర్చి తడిపె ప్రేమాశ్రువులతొ

81. అంత రాఘవు డాచార్య వర్యు గనియె
భక్తితో గురు శ్రేష్ఠుని పాదములకు
వందనములిడి యుచితాసనం బొసంగి
తండ్రి కుశలము రాముడు భరతునడుగ

82. నీవియోగము సహియింపనేర కాత్మ
నెనె్న దలచుచు స్వర్గస్తు లైరి తండ్రి
కర్ణ శూలములు భరతు వాక్యములకు
తల్లడిల్లిరి రామాదులార్తు లౌచు

83. దూరమున నుండి తమకడ కరుగు దెంచు
తల్లుల కెదురేగి నమస్కరించు కన్న
కొడుకులను కోడలిని జూచుకొనిరి వారు
దప్పి గొను గోవు లదకంబు గన్నయట్లు

84. శోక సాగరమగ్నులై యున్న వారు
గురు వశిష్టుని శాంతి వాక్యముల వినుచు
నెమ్మదిని పొంది గంగా ప్రవాహమందు
స్నాన మొనరించి పితృ తర్పణమ్ము లిడిరి

టంగుటూరి మహాలక్ష్మి