Others

ప్రేమను పంచుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు, జాన్ ఇద్దరూ మంచి స్నేహితులు. వారి కులాలు వేరు. మతాలువేరు కాని వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరుండేవారుకాదు. కాని ఇరువురి పెద్దల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. ఒక్కోసారి వీరి పెద్దల మధ్య తగవులాటలు కూడా వచ్చేవి. అట్లాంటపుడు వీరిని అవతల వారితో మాట్లాడవద్దని వారి పెద్దలు చెప్పేవారు.
కాని వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా కూడా మాట్లాడుకొనేవారు. వీరి పెద్దల మధ్య కొట్లాటలు చూసి ఊరిలోనివారు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి వారి మధ్య తగవును బాగా పెంచేవారు.
అది చూసి పిల్లలిద్దరూ బాధపడేవారు. ఒకనాడు రాముడు జాన్ ఇద్దరూ పెద్దవారి ఆలోచనలో మార్పు తెప్పించాలనుకొన్నారు. ఇతరులు చెప్పే చాడీల వల్ల వీరి మధ్య అనవసరమైన రాద్ధాంతం జరుగుతోందని వారు అనుకొన్నారు. అందుకే రాముడు జాన్ ఇద్దరూ కలసి ఒక పన్నాగం పన్నారు.
ఒక మంత్రగాడితో నిధి ఒక పిల్లవానిని బలిస్తే దొరుకుతుందని రాముడు, జాన్ వీరిద్దరి తండ్రులకు చెప్పించారు.
ఆ తరువాత
రాముడి తండ్రికి నిధి గురించి చెప్పగానే మొదట పిల్లవాడు అంటే కష్టం అంటాడు. కాని ఆ నిధి చెప్పినవాడు ఇంత పెద్ద నిధి కదా బాగా ఆలోచించండి అని అనగానే జాన్‌ను బలిచ్చేస్తే సరిపోతుంది అనుకొని అదేవిషయం ఆ మంత్రగానితో చెప్పాడు.
అదేవిధంగా జాన్ తండ్రికి మంత్రగాడు చెప్పాడు. అతడూ విని బలి అనేసరికి కాస్త వెనకడుగు వేసాడు. కాని నిధి గురించి పూర్తి సమాచారం విని అయితే ఆ పొరుగువాని పిల్లవాడు జాన్ ఉన్నాడు కదా వాడ్ని బలి ఇస్తే సరి అనుకొన్నాడు. అదే విషయం మంత్రగానితో చెప్పాడు.
ఈ విషయం ఆనోట ఈనోట ఊరంతా పాకింది.
ఇద్దరూ తండ్రులు తమ తమ పిల్లల్ని బలి ఇద్దామనుకొంటున్నారని తెలుసుకొని ఇద్దరూ వీరావేశం తెచ్చుకున్నారు. వెంటనే ఈ సంగతి పంచాయితీలో తేల్చుకోవాలని అనుకొన్నారు. ముందుగా ఊరి పెద్దలకు చెప్దామనుకొన్నారు..
కాని వీరిద్దరూ ఊరిపెద్దల దగ్గరకు వెళ్లేసరికి రాముడు భీముడు అక్కడే ఉన్నారు.
వారిద్దరూ ఊరి పెద్దలతో మా నాన్న ఇలా చేయాలనుకొంటున్నాడట. రాముని బదులు నన్ను ఇవ్వమని జాన్, జాన్ కు బదులు నన్ను ఇవ్వమని రాముడు బలి ఇవ్వమని వారితో మీరైనా చెప్పండి అని బతిమిలాడుకుంటున్నారు.
అపుడు ఆ మాటలు ఇద్దరూ తండ్రులు విన్నారు.
వీరిని చూసిన ఊరిపెద్ద పెద్దవాళ్లిద్దరినీ పిలిచి చేయబోయే పనిని గురించి కనుగొని ఇద్దరికీ చీవాట్లు పెట్టాడు.
మీరు ఎంత క్రూరులో మీ పిల్లలంత మంచి వాళ్లు కదా. చూడండి. వారు ఒకరికోసం ఒకరు బలి కావడానికి ముందుకు వస్తున్నారు. మీరు మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికైనా మీకు తెలుస్తోందా? అని గట్టిగా మందలించారు.మంత్రగాని మాటలు నిజమని మీకు తెలుసా? అని కూడా అడిగారు.
యేసు మాటలు నమ్మినవారు ఎవరైనా ఇతరులకు కీడు చేయాలనుకొంటారా? ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు అందరినీ ప్రేమించమని మీకు చెప్పింది గుర్తులేదా అని అపుడే అక్కడికి వచ్చిన ఫాదర్ చెప్పారు.
దానితో వారిద్దరికీ బుద్ధి వచ్చింది.
అయ్యా తప్పు అయింది. ఇంకెప్పుడూ ఇలా ఆలోచించము. పైగా మేమిద్దరూ పోట్లాటలు ఆపేస్తాము.ఆ కలసి ఉండలేని తనం వల్లనే ఇతరులు మాకు అపోహలు సృష్టించారు. మా వల్ల పిల్లలు అన్యాయం అయిపోయేవారు. కనుక ఇప్పట్నుంచి మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం అని చెప్పారు.
అపుడు పిల్లలు, ఊరిపెద్దలూ ఇద్దరూ సంతోషించారు. అప్పట్నుంచి ఆ ఊరి వారంతా ఎంతో సంతోషంతో కలసిమెలసి ఉండేవారు.

- దాసరి రాణి