Others

సుమధుర రామాయణం.. ( అకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

133. మంద హాసముతో రామచంద్రమూర్తి
జనకజా నీవు ధర్మ సమ్మతములైన
వచనములు బల్కితివి విదేహావనీశు
పుత్రివలె గాని రాజునై నట్టినేను

134. నిస్సహాయుల గాచుట యుచిత మనుచు
దలతు నిక్ష్వాకు కులధర్మ మిదియోగాన
నిన్ను లక్ష్మణు నైనను విడువ జంక
ధర్మ మార్గమున నెపుడును దప్ప నేను

135. ఋషిజనంబుల బాధించు రాక్షసులను
సంహరించి రుూ వనము నిష్కంట కమ్ము
జేసి వారలు శాంత జీవనము గడుపు
నట్లొనర్చెద ననె రాఘవ ప్రభుండు

అరణ్యకాండ
136. దండక వనవాసు లనలతేజులు మునుల్
రామచంద్రు సత్కరించిరంత
ఇట్లు వారి చెంత పదివత్సరంబులు
గడిపి చనిరగస్త్యు గనుగొనంగ

137. రామ చంద్రుడు జనకజా లక్ష్మణులకు
కుంభసంభవు మహిమను జెప్ప దొడగె
పూర్వ మొకపరి వింధ్యాద్రి గర్వమణచి
కపట దైత్యులు వాతాపి యిల్వలులను

138. వారు విప్రుల వేషంబులను ధరించి
భూమి సురులను యాతిధ్యమునకు బిల్చి
మేకగా మారి నట్టి వాతాపి మాంస
మతిరు చికరంబు గావండి యిల్వలుండు

139. అతిథులకు బెట్టి వారలు దినిన పిదప
రమ్ము రమ్మింక వాతాపి యనుచు బిల్వ
వుదరములు జీల్చుకొని వచ్చి విగతజీవు
లైన విప్రుల భక్షించు సోదరులకు

140. అతిథియై జని సర్వంబు గుడి చెరింగె
మేష రూపైన వాతాపి మాంస మంచు
యిల్వలుడు బిల్వ వాతాపి రమ్మటంచు
ఇంక నెక్కడి వాతాపి జీర్ణమయ్యె

141. ననిన కలశజుహుమ్మంచు మ్రింగవచ్చు
నిల్వలు ననల దృష్ఠిచె భస్ముజేసె
అంతటి మహిమాన్వితుడీ తడనుచు దెల్పె
కుంభ సంభవు మహిమను రఘువరుండు

142. మోదమున మార్గశ్రమమును మరచి జనిరి
సుందరమ్ము ప్రశాంతము ఋషియుతమ్ము
జ్ఞానియును మహత్తర తపఃశ్శక్తి శాలి
నగస్త్యని యాశ్రమ ప్రాంతమునకు

143. అచటి నున్నట్టి కలశజు శిష్యుతోడ
దాశరథులము మేము నా భార్య ఈమె
వౌని దర్శనమును గోరి వచ్చితిమని
జెప్పుడని బల్కె రాముడు సవినయముగ
*

టంగుటూరి మహాలక్ష్మి