Others

చిన్మయరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనుల హృదయమాలిన్యాన్ని పోగొట్టే మహాలక్ష్మి మంగళప్రదయై సౌభాగ్యలక్ష్మిగా, ధైర్య, స్థైర్య,స్థిరబుద్ధులను మానవాళికి ప్రసాదిస్తుంది. ఈ తల్లేఆదిలక్ష్మి సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా అష్టమూర్తులలో విరాజిల్లుతోంది. అందుకే లక్ష్మి దేవి సంపదకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, తుష్టికి, పుష్టికి, యశస్సులకు మూలకారణంగా సర్వులచేత పూజించబడుతోంది. ఇహపరసుఖాలనిచ్చే మోక్షలక్ష్మి శ్రీ సూక్తం సమబుద్ధిని ప్రసాదిస్తుందని చెప్తుంది. దుర్గమాలను పోగొట్టేటపుడు తల్లి ని దుర్గామాతగా ఆరాధించబడి, కష్టసమయాలలో స్థిరచిత్తాన్ని ఇచ్చి విజయాన్ని చేకూర్చేటపుడు ధైర్యవిజయలక్ష్మిగా కొనయాడబడుతుంది. అష్టదళపద్మంలో ఆసీనురాలైన లక్ష్మి చిద్రూపియై చిన్మయరూపిణిగా వెలుగొందుతుంది.