Others

అధిక రక్తపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక రక్తపోటు ఉన్న ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు తీవ్ర అనారోగ్యాలతో మృత్యువుకు చేరువవుతున్నట్లు వైద్య నిపుణులు తేల్చారు. అధిక రక్తపోటు వల్ల గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం తీవ్రరూపం దాల్చుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి మూడో వ్యక్తి పాలిట- అధిక రక్తపోటు అనేది ఓ ‘సైలెంట్ కిల్లర్’గా మారింది. దీన్ని ముందుగానే గుర్తించి కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటును పూర్తిగా నివారించలేకపోయినా జీవనశైలిలో మార్పుల వల్ల ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఆహారంలో ఉప్పును బాగా తగ్గించుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్, ప్యాకేజీ ఫుడ్‌కు స్వస్తి పలకాలి. పొటాషియం పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి, అరటి పండ్లను విరివిగా తినాలి. బీన్స్, గింజల్లోనూ పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. చిప్స్, పచ్చళ్లు, సాస్‌లకు బదులు తాజా పండ్లను తీసుకోవడం మంచిది. వేపుడు పదార్థాలను సాధ్యమైనంత తగ్గించాలి. అధిక రక్తపోటు వల్ల శరీరం బరువు పెరుగుతుంటుంది. తరచూ బరువు చూసుకుంటూ అధిక రక్తపోటును తగ్గించుకునేలా జాగ్రత్త పడాలి. శారీరక వ్యాయామం వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. నడక, సైక్లింగ్, తోటపని, ఇంటిపని వల్ల శారీరక శ్రమకు అవకాశం ఉంటుంది. మద్యపానాన్ని వదులుకోవడమో లేదా తగ్గించడమో చేస్తే అధిక రక్తపోటు నుంచి బయటపడొచ్చు.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003