Others

కాలుష్యం కాటు.. గుండెకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ కాలుష్యం మనిషి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ గాలిలో కలిసి అది తీవ్ర అనర్థాలకు దారితీస్తోంది. ఈ పొగ కాలుష్యం మనిషిలో అధిక రక్తపోటుకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం చైనాలోని గౌంగ్‌డాంగ్ ప్రొవిన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌వారు నిర్వహించిన పదిహేడు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. కలుషిత గాలిని పీల్చటం వల్ల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురవతుంటాయని తెలుసు. కాని తాజా అధ్యయనాల వల్ల ఇది గుండెకు కూడా చేటు తెస్తుందని వెల్లడైంది. గాలిలోని కార్భన్‌డైఆక్సైడ్, దుమ్మూదూళీ తదితరమైనవి రక్తపోటుకు దారితీస్తున్నాయి. చైనాలో జరిగిన పలు అధ్యయనాల్లో దాదాపు 17 అధ్యయనాలు దీనిపై హెచ్చరిస్తున్నాయని టావోలియు అనే పరిశోధకుడు తెలియజేశారు. దాదాపు 1,08,000 మంది అధిక రక్తపోటుతో బాధపడేవారిపైన, రక్తపోటు అసలే లేని 2,20,000మందిపై వీరు అధ్యయనం చేశారు. గాలి కాలుష్యం అధికంగా ఉంటే వీరిలో రక్తపోటు లెవెల్స్‌లో మార్పు వచ్చినట్లు గమనించారు. *