AADIVAVRAM - Others

ఒక చెట్టు.. ఒక పువ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది అంటే ఏమిటి?
ఒక చెట్టు, ఒక పువ్వు...

చెట్టంటే ఏమిటి?
దేవ దానవులు అమృతం కోసం ఘర్షణ పడగా
నేల మీద జారిపడిన అమృతం బొట్టు..
రాక్షసులు ఇబ్బందులు పెడుతున్నా
నరులకు వరాలిచ్చే మహాశివుడి బంటు..
శిథిలమైన పాత చర్మాన్ని ఒలిచేసుకొని
పచ్చని కొత్త చర్మం ధరించి ‘అప్‌డేట్’ అవుతుంది చెట్టు..
ఉగాది అంటే ఏమిటి?
కాలం గుండెలో నాటిన పచ్చని మామిడిచెట్టు,
మనుషులకు వసంతం పంచుతున్న సుఖం
మామిడిపండు..

పువ్వంటే ఏమిటి?
ప్రేమించాలని బలవంతం చేస్తున్న
గాలి కాముకుడు వెంటబడుతున్న అమ్మాయి,
ఇష్టం లేదంటే వడగాలి ‘యాసిడ్’ దాడికి గురికాబోయే
అందమైన మోము...
నువ్వు మనిషివైతే
ఒక్కసారి నీవు కనె్నత్తి చూస్తే చాలు
పువ్వు నవ్వుకుంటూ చేరి నీ గుండె విలువ పెంచుతుంది
నిన్నూ ఓ నడిచే పువ్వును చేసి లోకానికి నీ పరిమళం
పంచుతుంది...
ఉగాది అంటే ఏమిటి?
ఒక స్వీటు.. ఒక స్వీటు లాంటి కోకిల పాట...

స్వీటంటే ఏమిటి?
మట్టి పువ్వు నుంచి తీసిన అత్తరు సారం
స్వీటంటే బాగా ఇష్టపడేవారికి
సంవత్సరానికి ఒకసారైనా మట్టికున్న
అన్ని రుచులు చూపించటానికి
ఉదయం గినె్నలో పెట్టి పచ్చడి తీసుకొస్తుంది ఉగాది...

కోకిల పాటంటే ఏమిటి?
వసంతంతోనే మొదలయ్యేది కాదు
ఆరుకాలాలలోనూ పాడుతూనే ఉండేది.
తనను ముంచేయటానికి పైన పోసిన చీకటి కుప్పల్ని
గొంతుతో తవ్వుకుంటూ తవ్వుకుంటూ
ఉగాది నాటికి బయటపడేది...

పిట్టకు చెట్టే గుడి,
మనిషికి మట్టే బడి
కాలానికి వసంతం పెట్టుబడి
సూర్యుడు దున్నబోయే ఉగాది మడి..

నాకు మీసం మొలిచీ మొలవనప్పుడు
ఓ అందమైన పల్లెటూరి శ్రామిక అమ్మాయి
నాకిచ్చిన తొలి ముద్దు లాంటిది
ఉగాది ఉషోదయంలోని తొలి కిరణం
అందుకే ఏటా ఉగాదికి చెబుతూంటా స్వాగతం..

-డా.రావి రంగారావు 92475 81825