Others

దేశభక్తంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడందరివీ చీకటి బతుకులే
సూర్యోదయమవుతున్నా..
బిక్కుబిక్కుమంటూ
కాలం గడుపుతున్న రోజుల్లో..
అందరి గుండెలకీ
ఆత్మస్థైర్యాన్ని నింపిన
యుగపురుషుల కాలమది!

పూరిగుడిసెల్లో
చీకటి పారద్రోలి చైతన్యం నింపే
కాగడాల వెలుతురుకి
నడకలొచ్చిన సమయమది!

నిజానికప్పుడు భయాన్ని
ఆయుధంగా వాడి
మనపై పెత్తనం చలాయించిన రోజులవి!
బానిసలను చేసుకొని
మేధస్సు మాదేనని విర్రవీగే
అస్తమించని చేదు జ్ఞాపకాలవి!

ధైర్యాన్ని బలంగా మార్చుకుంటే
పిడికిలై ఆకాశానికి ఎగుస్తుందని నమ్మిన
ఎందరో అమరవీరులను దాచుకున్న చరిత్రిది!
వీరతిలకాలు దిద్దుకుని
రొమ్ములను ఇనుపగుళ్ళకు ఎదురుచూపి
దేశపు స్వాతంత్య్రపు సంకెళ్ళు తెంచిన
దేశాభిమానుల స్వరాజ్యమిది!

దేశభక్తంటే...
భక్తికాదు కానేకాదు!
దేశంలో నలుగురికి అండగా నిలవడం!
పదుగురికి ఆసరా కల్పించడం!!

-కుంచెచింతా లక్ష్మీనారాయణ, ఎద్దులపల్లి