AADIVAVRAM - Others

శక్తిసామర్థ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య ఓ కాలేజీ వార్షికోత్సవ సభకి పిలిచారు. వాళ్ల సర్ట్ఫికెట్స్, అవార్డుల ప్రదానానికే చాలా సమయం గడిచింది. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు. నాతో పాటు మరో ముగ్గురు మాట్లాడాలి. అందుకని నా ఉపన్యాసం చిన్నగా వుండాలి, వాళ్లని వాళ్ల లక్ష్యాల వైపు ప్రేరేపించినట్టుగా ఉండాలి. ఆ కాలేజీలో రకరకాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. అందుకని నా ఉపన్యాసం ఇలా కొనసాగింది.
మీ లక్ష్యం ఏమిటో నాకు తెలియదు.
మీ లక్ష్యం వైపు నడవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది ఏమిటో కూడా నాకు తెలియలేదు.
మీ శక్తిసామర్థ్యాలను సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు.
మీ ప్రపంచాన్ని మంచి ప్రపంచంగా మార్చడానికి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు.
కానీ
నాకు కొన్ని తెలుసు.
మీ లక్ష్యం వైపు మీరు ప్రయాణం చేస్తున్నారని తెలుసు.
మీ లక్ష్యం వైపు నడవడానికి మీలో ప్రోత్సాహకారి ఉన్నాడని నాకు తెలుసు.
మీ ప్రపంచం మంచి ప్రపంచంగా మార్చడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారని తెలుసు.
మీ లక్ష్యం వైపు నడవడానికి మీరు అవిరళ కృషి చేస్తున్నారని తెలుసు.
ఆ విధంగా మీరు ప్రయత్నం చెయ్యాలని నా ఆకాంక్ష.
ఈ విధంగా నా ఉపన్యాసం కొనసాగింది.
*

- జింబో 94404 83001