AADIVAVRAM - Others

శ్రీ విలంబ రావమ్మా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్రమాసపు ప్రభాతవేళ
ముంగిట్లో విరిసిన మల్లె
జాజి పరిమళాలతో
కొత్త ఆశలు చిగురింపచేసి
సరికొత్త ఊహలకు ఊపిరులూది
మంచుపూల దుప్పటి కప్పుకున్న
శిశిరాన్ని తరుముతూ...
ఆదివై.. యుగాదివై.. రావమ్మా
పూలతేరువై విచ్చేయు
వసంతుని ఆగమనంతో..
ప్రకృతికాంత నవశోభలు విలసిల్లగా
గున్నమామిడి కొమ్మపై
మత్తకోకిల సుస్వరం ఆలపించగా
పంచాంగ శ్రవణాల లాభనష్టాలు
బేరీజు వేసుకునే...
సామాన్యులకు ప్రతి ఉగాదిలో
ఓ కొత్త సందేశం చెబుతూ
నిర్దిష్ట మార్గనిర్దేశం చేస్తూ.. రావమ్మా
తెలుగింటి ముంగిళ్లు
మావిళ్ల తోరణాలతో..
అనుబంధాల ఆప్యాయతల
మధురిమలతో..
మమకారాల పూలు పూయాలి
నవఉషస్సు కోటికాంతులతో
జగతి పులకరించి పరవశిస్తోంది
షడ్రుచుల సంగమమైన జీవితంలో
ఉగాది పచ్చడి
సమైక్యతా రాగం పలికించాలి
సంబరాల సంతోషాల హేల...
ఆమని సొబగుల ఆనందడోల..
ప్రతి మదిలో వెల్లివిరియాలి
సంతసాల వేదిక నలంకరింప
రావమ్మా శ్రీవిలంబ ఉగాది లక్ష్మి...!

-ములుగు లక్ష్మీ మైథిలి 94400 88482