Others

ఇలా చేసి చూడండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహిళల్లో కూర్చుని కంప్యూటర్ల ముందు గంటల తరబడి పని చేసే వారు ఎక్కువ అయపోతున్నారు. లేకుంటే నిలబడి గంటల తరబడి ఉంటున్నారు. దేనినైనా అతిగా చేసే వృత్తి ఉద్యోగాలు మహిళలు చేస్తున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యంపై దెబ్బ పడుతోంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసుకొనే వారిలో పెద్ద పెద్ద పొట్టలు తయారు అవుతున్నాయ. శారీరిక శ్రమ లేనందున కూడా వారిలో కొవ్వు శాతం ఎక్కువ అవుతోంది. ఇట్లాంటి వారు తమ లావును తగ్గించుకొని సన్నగా నాజుగ్గా మారాలంటే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచింది. పొద్దునే్న గంటసేపు వాకింగ్ చేయడం ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. కాని మహిళలకున్న పనుల వల్ల వారికి అంత సమయం చిక్కక నడకను వాయదా వేసుకొంటుంటారు. అట్లాంటి వారు ఒక పావుగంటనో అరగంటనో వారి కోసం కేటాయంచుకుని స్కిపింగ్ చేస్తే సులువుగా పొట్టలో పేరుకున్న కొవ్వును దూరం చేసు కోవచ్చు అంటున్నారు నిపుణులు. పొట్టపై పేరుకుపోయిన కొవ్వును స్కిప్పింగ్‌ను సులభంగా కరిగించవచ్చు. స్కిప్పింగ్ ద్వారా డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించవచ్చునని. స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గడమే కాదు.. ఊపిరితిత్తులకు మేలు కలు గుతుంది. ఇలా చేయడంతో తరచూ భుజాలు తిరుగుతుంటాయి. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి. చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. చిన్న వయసువారు స్కిప్పింగ్ అలవాటుచేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. ఇలా చేయడంవల్ల గుండెకు మంచి వ్యా యామం చేకూరుతుంది.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003