Others

వధువు సోయగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న కాలంతో పాటే చెవులకు ధరించే ఆభరణాల్లోనూ కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయి. మగువల ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగా విభిన్న డిజైన్లలో కాంతులీనే ఆభరణాలకు మార్కెట్‌లో నేడు కొదవలేదు. చెవులపై ఒకప్పుడు బంగారు లోలాకులే కనిపించి కనువిందు చేసేవి. ఇపుడు పలురకాల మెటల్, కృత్రిమరాళ్లు, డైమండ్స్, పూసలు, అద్దాలు అద్దిన వినూత్న నగిషీలతో నగలు అందుబాటులో ఉన్నాయి. తళుక్కుమనే చెవి ఆభరణాలంటే నేటి తరం అమ్మాయిలు ఎంతగానో మనసు పడుతున్నారు.
కాలేజీకైనా, కార్యాలయానికైనా విలక్షణమైన చెవి దుద్దులను ధరించి వెళ్లాలని అతివలు ఆరాటపడుతున్నారు. తాము వేసుకునే దుస్తులకు ‘మ్యాచ్’ అయ్యేలా రంగురంగుల చెవి ఆభరణాలకు మహిళలు మోజు పడుతూ ఎంతటి ఖర్చుకైనా వెనుకాడడం లేదు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో ముస్తాబయన ఈ నవ వధువు ధరించిన ఆభరణాలు చూస్తుంటే ఎవ్వరైనా ముచ్చటపడాల్సిందే.. పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరూ పెళ్లి కూతురు ధరించిన ఆభరణాల గురించే చర్చించుకోవడం విశేషం.