Others

ఐటి రంగంలోనూ వివక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక యుగంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని అర్హతలున్నప్పటికీ ఐటి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలకు 20 శాతం మేరకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సూపర్‌వైజరీ, నాన్ సూపర్‌వైజరీ ఉద్యోగాల్లో మహిళలకు చెల్లిస్తున్న వేతనాల్లో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. నాన్ సూపర్‌వైజరీ కేటగిరీలో పురుషులకు గంటకు సగటున 255.32 రూపాయలు, మహిళలకు 206.28 రూపాయలు చెల్లిస్తున్నారు. సూపర్‌వైజరీ కేటగిరీలో అయితే పురుషులకు గంటకు సగటున 461.89 రూపాయలు, స్ర్తిలకు 375.29 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగావకాశాలు కల్పించే ‘మోన్‌స్టర్ ఇండియా’, ఐఐఎం- అహ్మదాబాద్, ‘పేచెక్ ఇన్ డాట్ కామ్’ సంస్థలు జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఐటి రంగంలో మహిళలు పురుషుల కంటే 18 నుంచి 20 శాతం వరకూ తక్కువ వేతనాలు పొందుతున్నట్లు తేలింది. పదోన్నతుల విషయంలోనూ పురుషులే ముందంజలో ఉంటున్నారు. రాత్రి వేళల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడం, కొన్ని సామాజిక కారణాల రీత్యా ఐటి రంగంలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోతున్నారు. మహిళల అజమాయిషీ కింద పనిచేసేందుకు చాలామంది పురుషులు నిరాకరించడం కూడా కనిపిస్తోంది. ఆధునికతకు ఐటి రంగం తిరుగులేని నిదర్శనమని అంతా భావిస్తుండగా, ఇందులోనే మహిళల పట్ల వివక్ష కొనసాగడం గమనార్హం.