Others

గౌరవం ముఖ్యమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమకు అనువైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలంటే మహిళలు ఎన్నో విషయాలు ఆలోచించుకుని అడుగు ముందుకు వేస్తుంటారు. సామాజిక రక్షణ, ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివన్నీ ఆమెచేసే ఉద్యోగంతో ముడిపడివుంటాయి. ఆధునిక కాలంలో ఆలుమగలిద్దరూ ఉద్యోగాలు చేయకతప్పని పరిస్థితిలో మహిళలు తాము ఎంచుకునే ఉద్యోగం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించక తప్పదు. మహిళలు ఎక్కువగా ఏయే ఉపాధి రంగాల్లో ఉన్నారు? వారి వేతనాల పరిస్థితిపై తాజాగా ఓ సంస్థ సర్వే నిర్వహించింది. మిగతా అన్ని రంగాల్లో కంటే రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలకు చక్కటి వేతనాలు ఇస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. వాస్తవానికి మహిళలు ఎక్కువగా ఆరోగ్య రంగం (హెల్త్‌కేర్)లో కొనసాగటానికి ఇష్టపడతారు. అందులో పనివేళలు, ఇతర సౌకర్యాలు వారికి ఎంతో అనువుగా ఉంటాయ. తమ జీవన విధానానికి అనువుగా పనివేళలను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగేందుకు వీలుంటుంది. దాదాపు 65 శాతం మంది మహిళలు ఆరోగ్యం, వైద్య రంగాల్లో రాణిస్తున్నారు. దీనికి పోటీగా నేడు రియల్ ఎస్టేట్ రంగం ఉద్యోగినులకు అనువైనదిగా ఉన్నట్లు తేలింది. ఈ రంగంలో జీతాలు కూడా పుష్కలంగా లభిస్తున్నట్లు వెల్లడైంది.
వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగినులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో యాజమాన్యాలు మంచి వేతనాలు ఇస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. నిర్మాణ రంగం, గృహాలంకరణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉద్యోగాలు మహిళలకు ఆర్థికంగా, జీవన విధానానికి అనుకూలంగా ఉంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. పారిశ్రామిక రంగంలో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ విభాగం చిన్నదే. కానీ, ఇందులోకి వచ్చే మహిళలకు యాజమాన్యాలు గౌరవంతో పాటు మంచి వేతానాలు ఇచ్చేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నాయ. దీంతో ఈ రంగంలో 60 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. సాంకేతిక రంగంలోనూ మంచి వేతనాలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు విద్య, పరిశోధనా రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోంది. *

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003