AADIVAVRAM - Others

రెండో అయోధ్య ఒంటిమిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని రామాలయాల్లో విశిష్టత కలిగి రెండో అయోధ్యగా పేరుగాంచిన చారిత్రక ప్రాధాన్యత గల రామక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. అద్భుతమైన శిల్పకళాకృతులు, ఆకాశాన్నంటినట్టుండే మూడు గోపురాలు, సువిశాలమైన మండపం, ఎతె్తైన ధ్వజస్తంభంతో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఏకశిలానగరంగా పిలవబడే ఒంటిమిట్ట రామాలయం విజయనగర రాజుల కాలం నాటి కళావైభవానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం, నాగేంద్రుని ఆకారంలో ఎతె్తైన మూడు గోపురాలు, 180 అడుగుల ఎత్తు గాలిగోపురం, 30 స్తంభాల ముఖ గోపురం, ఏకశిలపై వెలిసిన శ్రీ సీతారామలక్ష్మణులు, హనుమంతుడు లేని గుడిగా ఈ ఆలయం ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది. రాష్ట్ర విభజన అనంతరం 2015 ఫిబ్రవరిలో తొలిసారిగా ప్రభుత్వం తరపున ఇక్కడ నవమి ఉత్సవాలు నిర్వహించారు. దేశంలోని మిగతా రామాలయాలకు భిన్నంగా నవమి రోజు ఇక్కడ శ్రీరామచంద్రుని జయంతి వేడుకలు మాత్రమే నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే పౌర్ణమినాటి రాత్రి పండు వెనె్నలలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఆ పేరు ఎలా..
ఒంటిమిట్ట పేరుకు సంబంధించి ఓ కథ ఇక్కడ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉంది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు గజదొంగలు ఈ ప్రాంతంలో ప్రజలను దోచుకుని భయ పెట్టేవారు. వారికి ఓ రోజు రాతి శ్రీరామచంద్రుడు కలలో కనిపించి దొంగతనాలు మాని సత్ప్రవర్తనతో జీవించాలని హితోపదేశం చేస్తారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు దొంగలు దొంగతనాలు మాని స్వామివారికి ఆలయం నిర్మించి పూజించినట్లు చెప్పుకుంటుంటారు. వారి పేర ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అన్న పేరు వచ్చిందని చెబుతుంటారు.
ఎందరో మహానుభావులు.. ఎంతోమంది మహానుభావులు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని దర్శించి పునీతులయ్యారు. వీరిలో మొదటివాడు బమ్మెర పోతనామాత్యులు. పోతన ఒంటిమిట్టవాసిగా ప్రసిద్ధి చెందారు. ఈయన ఒంటిమిట్టలో ఉంటూ మహాభాగవతం రచించి రామునికి అంకితం చేశారు. గజేంద్ర మోక్షం ఘట్టం రచనా సమయంలో అల వైకుంఠపురం పద్యంలో కొన్ని చరణాలు ఆలోచనకు తట్టకపోవడంతో స్వయానా రామచంద్రుడే ఆ పద్యాలు పూర్తిచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా తాళ్లపాక అన్నమాచార్యులు నిత్యం ఒంటిమిట్ట కోదండ రామస్వామిని దర్శించి తన గానామృతంతో స్వామిని కీర్తించేవారు. ఇమాంబేగ్ అనే నవాబు స్వామివారి అభిషేకం కోసం ఆలయం ఆగ్నేయ భాగంలో బావిని తవ్వించారు. నేడు ఈ బావి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది. అదేవిధంగా హరిజనుడైన భవనాసి మాట ఓబన్న స్వామిని దర్శించిన మహానుభావులలో ఒకరు.
*

-ఏళేశ్వరం మధుమూర్తి